అంగమార్పిడి చేయించుకోవడం మంచిది: లక్ష్మి భూపాల

తెలుగు సినీ పరిశ్రమలో విషాదకరమైన జీవితాలు లెక్కకు మించి ఉంటాయి. ఆ జీవితాల్లో విషాదాన్ని తగ్గించుకోవడానికి కొంతమంది కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పుల్లో ఒక్కటి ప్రముఖుల పేర్లును వాడుకోవడం, ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలు చేసేవాళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నారట. ముఖ్యంగా రచయితల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుంది. నిజానికి సినిమా ఇండస్ట్రీలో రచయితగా పేరు రావాలంటే టాలెంట్ కంటే కూడా అదృష్టం కూడా పని చేయాలి. అలాగే మంచి టీం దొరకాలి. దొరికినా ఆ టీంలోని మెయిన్ […]

Written By: admin, Updated On : July 10, 2021 10:47 am
Follow us on

తెలుగు సినీ పరిశ్రమలో విషాదకరమైన జీవితాలు లెక్కకు మించి ఉంటాయి. ఆ జీవితాల్లో విషాదాన్ని తగ్గించుకోవడానికి కొంతమంది కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పుల్లో ఒక్కటి ప్రముఖుల పేర్లును వాడుకోవడం, ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలు చేసేవాళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నారట. ముఖ్యంగా రచయితల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుంది.

నిజానికి సినిమా ఇండస్ట్రీలో రచయితగా పేరు రావాలంటే టాలెంట్ కంటే కూడా అదృష్టం కూడా పని చేయాలి. అలాగే మంచి టీం దొరకాలి. దొరికినా ఆ టీంలోని మెయిన్ వ్యక్తికి మంచి హృదయం ఉండాలి. అతను తన దగ్గర పని చేసిన రచయితకు పేరు వేయాలి. ఇవన్నీ జరగాలి అంటే.. ఆ రచయిత పెట్టి పుట్టాలి. అలా పుట్టినోళ్లు తక్కువమంది ఉంటారు కాబట్టి, మిగిలిన వాళ్ళు నానా కష్టాలు పడాల్సి వస్తోంది.

తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోసం నానా తంటాలు పడుతున్నారు. దాంతో కొత్త రచయితలూ పేరు ఉన్న రచయితల పేర్లను వాడుకుంటూ అవకాశాలను అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే డైలాగ్ రైటర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న రచయిత లక్ష్మి భూపాల దగ్గర ‘ఘోస్ట్ రైటర్’గా పనిచేశామంటూ కొందరు కొత్త రచయితలు ఆయన పేరును వాడుకుంటున్నారట.

తన దగ్గర ఎవరూ ఘోస్ట్ రైటర్లు లేరని, తస్మాత్ జాగ్రత్త అంటూ ఫేస్ బుక్ లో లక్ష్మి భూపాల ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఏమిటో మీరు ఒక లుక్కేయండి.

దర్శకనిర్మాతల్లారా.. నిర్మకదర్శాతల్లారా..

నా దగ్గర అసిస్టెంట్ రచయితగా పనిచేశానని, నాకే తెలీకుండా నా దగ్గర ఘోస్ట్ దెయ్యం రైటర్ గా పనిచేశానని ఈమధ్య కొందరు మార్కెట్లో ఏ మాత్రం సిగ్గులేకుండా నా పేరు విచ్చలవిడిగా వాడేస్తున్నట్టు తెల్సింది.. ఇది మొదటిసారి కాదు.. వాళ్ళని నిలువునా తోలుతీసి ఉప్పూకారం రాసే మంచితనం నా దగ్గరున్నా నన్నెవరూ నిజానిజాలు అడగలేదు కాబట్టి నేను కూడా చెప్పలేదు.. ఇప్పుడు ఏకంగా నా అసిస్టెంట్ అని చెప్పుకుంటూ కొందరు కొన్నిచోట్ల అడ్వాన్స్ లు కూడా తీసుకున్నారని తెలిసింది.. వాడెలా రాస్తాడో చూడాలిగానీ, అలా చెప్తే ఎలా డబ్బులిచ్చారని నేను అడిగితే “మీ దగ్గర పనిచేసాడన్న నమ్మకం” అన్నారు.. ఇది చాలా పెద్ద తిట్టు నాకు.. కాబట్టి ఇప్పుడు తప్పడం లేదు..

నేను సినిమాల్లో మాటలు, పాటలు రాయడానికి ఇప్పటివరకు కేవలం నా బుర్రని తప్ప ఇంకెవరి సహాయం తీసుకోలేదు, ఒక్క అసిస్టెంట్ కూడా లేడు, ఇకముందు కూడా ఆ అవసరం లేదు.. ఎందుకంటే నిర్మాత, దర్శకుడు నన్ను, నా బుర్రని నమ్మి డబ్బులిస్తారని నేను నమ్ముతాను కాబట్టి.. అసిస్టెంట్లను పెట్టుకునే ఇతర రచయితల ఇబ్బందులు నాకు తెలీదు కాబట్టి వారి విషయంలో నేను మాట్లాడలేను.

ఇక నా పేరు వాడుకుంటున్న దరిద్రులకు ప్రేమగా ఒక అభ్యర్ధన..”అమ్మలారా.. అయ్యాలారా.. ఇకముందు మీరు ఇలాంటి మోసాలు, కక్కుర్తి ఎదవపనుల కోసం నా పేరు వాడినట్టు నాకు తెలిస్తే మాత్రం…… మీ తల్లిదండ్రుల, మీ భార్యాబిడ్డల, మీ స్నేహితుల చెప్పుల్తో కొట్టించి టీవీ లైవ్ పెట్టించి మరీ సన్మానించబడును.. నీ స్వార్ధం కోసం పక్కోడి పేరుని వాడుకోవడం కంటే అంగమార్పిడి చేయించుకోవడం మంచిది..”

దయచేసి ఇలాంటి వాళ్ళని నమ్మకండి.. ఎందుకంటే…. నా కేరాఫ్ నేను మాత్రమే.. నాకెక్కడా బ్రాంచీల్లేవ్..