దేశంలో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మూడో దశ ముప్పు ఉందని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. రెండో దశ ఎంత ప్రమాదమో చెప్పకనే చెప్పింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడింది. దీంతో జనం అల్లాడిపోయారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కరోనా నిబంధనలను పూర్తిగా సడలించవద్దని సూచించారు. పరిస్థితులకు తగినట్లుగా మార్చుకోవాలని హెచ్చరించారు.
కరోనా రెండో దశలో ఎదురైన పరిస్థితులను గుర్తించుకుని నడుచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కొద్ది నెలల్లో మూడో దశ ముప్పు పొంచి ఉందని నిపుణులు పేర్కొంటున్న సందర్భంలో ప్రధాని నేతృత్వంలో ముందే అప్రమత్తమైంది. సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరతతో పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం కొరత లేకుండా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మందులు, ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుంటోంది.
ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో మెడికల్ ఆక్సిజన్ నిల్వలు, సరఫరాపై సమీక్ష నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 1500 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. పీఎం కేర్స్ సహకారంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఆక్సిజన్ లభ్యత, ప్లాంట్ల నిర్మాణంపై సమీక్షించారు. కరోనా నుంచి నిరంతరం అవగాహన కలిగి ఉండి అది మన దరికి చేరకుండా చూసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
పీఎష్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే 4 లక్షలకు పైగా ఆక్సిజనేటెడ్ బెడ్లకు ఆక్సిజన్ అందించేందుకు వీలవుతుందని తెలిపారు. వీలైనంత త్వరగా ఆక్సిజన్ ప్లాంట్ల ఉత్పత్తి ప్రారంభమయ్యేలాచూడాలని అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ కేంద్రాల నిర్వహణపై ఆస్పత్రి సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. వాటి పనితీరు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు.
కరోనా దేశం నుంచి ఇంకా పోలేదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మహమ్మారి విజృంభించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యాక్సినేషన్ చేయించుకోవాలని చెప్పారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉండాలన్నారు.