https://oktelugu.com/

కేటీఆర్ వర్సెస్ రాంచంద్రరావు.. పంచ్ ఇచ్చిన కేటీఆర్

‘పంచ్ ఫలక్ నూమాకే పంచ్’ అన్న సినిమా డైలాగ్ రిపిట్ అయ్యేలా తెలంగాణ రాజకీయాల్లో ఒక సంఘటన చోటుచేసుకుంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సవాల్ చేసిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచంద్రరావుకు అదిరిపోయే పంచ్ ఇచ్చి కేటీఆర్ గట్టి పంచ్ ఇచ్చారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం.. నిరుద్యోగులను మచ్చిక చేసుకునే పనిలో బీజేపీ పడింది. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచంద్రరావు ఓ సవాల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 1, 2021 / 07:46 PM IST
    Follow us on

    ‘పంచ్ ఫలక్ నూమాకే పంచ్’ అన్న సినిమా డైలాగ్ రిపిట్ అయ్యేలా తెలంగాణ రాజకీయాల్లో ఒక సంఘటన చోటుచేసుకుంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సవాల్ చేసిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచంద్రరావుకు అదిరిపోయే పంచ్ ఇచ్చి కేటీఆర్ గట్టి పంచ్ ఇచ్చారు.

    తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం.. నిరుద్యోగులను మచ్చిక చేసుకునే పనిలో బీజేపీ పడింది. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచంద్రరావు ఓ సవాల్ చేశారు.

    తాను ఉస్మానియా యూనివర్సిటీలో కూర్చుంటానని.. తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై చర్చకు రావాలని కేటీఆర్ ను రాంచంద్రరావు కోరారు. ఉద్యోగాల భర్తీపై ఉద్యమ గడ్డ అయిన ఉస్మానియా యూనివర్సిటీలో చర్చకు రావాలని మంత్రి కేటీఆర్ కు సవాల్ చేశారు..ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లిన రాంచందర్ రావు తాను ఇక్కడ వెయిట్ చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ బీజేపీ అభ్యర్థికి.. బీజేపీకి గట్టి పంచ్ ఇచ్చారు.

    మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై ప్రశ్నిస్తున్న బీజేపీకి అదే ఉద్యోగాల భర్తీపై మోడీ ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. ‘‘ఏడాదికి 2 కోట్ల చొప్పున 12 కోట్ల ఉద్యోగాలకు సంబంధించి సమాచారం సేకరిస్తూ బీజీగా ఉన్నా.. మోడీ జన్ ధన్ ఖాతాల్లో జమ చేస్తామన్న రూ.15 లక్షల వివరాలకై చూస్తున్నా.. ఎన్టీఏ దీనిపై సమాధానం చెప్పాలి. ఎన్డీఏ అంటే ‘నో డేటా అవెలబుల్’ అని కేటీఆర్ పంచుల వర్షం కురిపించారు.

    ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ నిరుద్యోగుల సమస్యలు , ఉద్యోగాల భర్తీ ప్రధాన ఎజెండాగా మారింది. బీజేపీ రాంచంద్రరావు వర్సెస్ కేటీఆర్ ఫైట్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.