మరో చిచ్చు పెట్టిన నిమ్మగడ్డ రమేశ్

ఏపీ ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ మరో చిచ్చు పెట్టారు. వివాదాస్పద నిర్ణయంతో అధికార పార్టీకి కంటగింపుగా మారారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్ల సేవలకు బ్రేక్ వేసిన ఆయన బలవంతపు చర్యలతో పోటీ నుంచి తప్పుకున్న వారికి మరో చాన్స్ ఇవ్వాలడి డిసైడ్ అయ్యాడు. బాధితుల అభ్యర్థనపై నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అలాంటి వారిపై సానుభూతితో వ్యవహరించి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మరోసారి అవకాశం కల్పించే ఆలోచనలో ఉన్నారు.ఈ విషయంలో ఈసీకి ఉన్న ప్రత్యేక […]

Written By: NARESH, Updated On : March 1, 2021 8:55 pm
Follow us on

ఏపీ ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ మరో చిచ్చు పెట్టారు. వివాదాస్పద నిర్ణయంతో అధికార పార్టీకి కంటగింపుగా మారారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్ల సేవలకు బ్రేక్ వేసిన ఆయన బలవంతపు చర్యలతో పోటీ నుంచి తప్పుకున్న వారికి మరో చాన్స్ ఇవ్వాలడి డిసైడ్ అయ్యాడు.

బాధితుల అభ్యర్థనపై నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అలాంటి వారిపై సానుభూతితో వ్యవహరించి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మరోసారి అవకాశం కల్పించే ఆలోచనలో ఉన్నారు.ఈ విషయంలో ఈసీకి ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకుబోతున్నారు.

బలవంతపు విత్ డ్రాలు, దౌర్జన్యాల కారణంగా నామినేషన్లు వేయలేని వారి వినతులపై కలెక్టర్లు నివేదికలు పంపారు. మరికొన్ని జిల్లాల నుంచి కడూా వివరాలు తెప్పించుకొని ఎన్నికలు సంఘం తుది ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు.

రేపు మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ వేసేందుకు అవకాశం ఇస్తున్నారు.. ఏకగ్రీవంగా ఎన్నికైన ఆ 11 చోట్ల రీనామినేషన్ కు అవకాశం ఇవ్వడంపై గెలిచిన అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి కార్పొరేషన్ లో ఆరు, పుంగనూరు మున్సిపాలిటీలో మూడు, కడప జిల్లా రాయచోటిలో రెండు ఏకగ్రీవాలలో రీనామినేషన్ జరుగనుంది.