సాధారణంగా ఇంట్లో ఏ వంట చేయాలన్నా ఉల్లి కచ్చితంగా ఉండాల్సిందే. ఉల్లి లేకపోతే వంటలు చేసుకోవడం కూడా సాధ్యం కాదు. అయితే రోజురోజుకు మార్కెట్ లో ఉల్లి రేటు అంతకంతకూ పెరుగుతోంది. మార్కెట్ లో కిలో ఉల్లి ధర 65 రూపాయల నుంచి 70 రూపాయల వరకు పలుకుతోంది. మొన్నటి వరకు కిలో ఉల్లి ధర 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు పలకగా కొన్ని రోజుల్లోనే ధర రెట్టింపు కావడం గమనార్హం.
Also Read: నెమలి పించం ఇంట్లో పెట్టుకుంటున్నారా… అయితే ఏం జరుగుతుందో తెలుసా..!
రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి ధరలు సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్, పాల ధరలు అంతకంతకూ పెరుగుతుండగా ఇప్పుడు ఉల్లిగడ్డలపై కూడా ప్రభావం పడటం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లి ధర 50 రూపాయల వరకు పలుకుతోంది. దేశంలో అతిపెద్ద మార్కెట్ లలో ఒకటైన లసాల్‌గావ్ మార్కెట్‌లో క్వింటా ఉల్లి ధర 1000 రూపాయలు పెరగడం గమనార్హం.
Also Read: ఏకంగా 256 ఏళ్ళు జీవించిన వృద్ధుడు.. రహస్యం ఏమిటంటే..?
క్వింటా ధర ఏకంగా 4,500 రూపాయలు పలుకుతుండటంతో వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు వ్యాపారులు సైతం ఇప్పట్లో ఉల్లి ధరలు తగ్గే ఛాన్స్ లేదని.. ఉల్లి ధరలు తగ్గాలంటే రెండు మూడు వారాలు అగాల్సిందేనని వెల్లడిస్తున్నారు. మరో నెల రోజుల్లో రబీ పంట మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయి.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
అకాల వర్షాలు ఉల్లి ధరలు పెరగడానికి కారణమని తెలుస్తోంది. రోజురోజుకు మార్కెట్లకు ఉల్లి సరఫరా తగ్గుతోందని.. ఫలితంగా ఉల్లి రేట్లు పైకి కదిలాయని వెల్లడిస్తున్నారు. రానున్న రోజుల్లో రేటు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.