Kollegio Neo Electric Scooter: దేశంలో రోజురోజుకు టూవీలర్లకు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరుగుతోంది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో చాలామంది ఎలక్ట్రిక్ టూవీలర్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రధానంగా స్టార్టప్స్ ఈ విభాగంలో ఇన్వెస్ట్ చేస్తుండగా కబీరా మొబిలిటీ అనే కంపెనీ కూడా ఎలక్ట్రిక్ టూవీలర్లను తయారు చేస్తోంది. 45 వేల రూపాయల స్థాయిలో ఎలక్ట్రిక్ టూవీలర్ కొనుగోలు చేయాలని అనుకుంటే ఈ కంపెనీ స్కూటర్లను కొనుగోలు చేయవచ్చు.
కొల్లెజియో ఎలక్ట్రిక్ టూవీలర్ పేరుతో ఈ కంపెనీ టూ వీలర్లను తయారు చేస్తోంది. ఈ స్కూటర్ ఢిల్లీ ఆన్ రోడ్ ధర 45,990 రూపాయలు కాగా రాష్ట్రాలను బట్టి స్కూటర్ ధరలలో స్వల్పంగా తేడాలు ఉండే అవకాశం ఉంది. కేవలం 5,000 రూపాయల డౌన్ పేమెంట్ ను చెల్లించి ఈ స్కూటర్ ను కొనుగోలు చేయవచ్చు. మిగిలిన మొత్తానికి బ్యాంక్ లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఐదేళ్ల లోన్ టెన్యూర్ తో స్కూటర్ తీసుకుంటే నెలకు కేవలం రూ.1015 ఈఎంఐ చెల్లించాలి.
తక్కువ మొత్తం ఈఎంఐ చెల్లించడం ద్వారా కొత్త స్కూటర్ ను సులభంగా ఇంటికి తీసుకొని వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కూటర్ ను ఒకసారి ఛార్జ్ చేయడం ద్వారా 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కూటర్ లో స్మార్ట్ ఈవీ కంట్రోలర్, డిస్క్ బ్రేక్, డిజిటల్ డ్యాష్‌బోర్డ్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ లాంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ పై గంటకు గరిష్టంగా 24 కిలోమీటర్ల వేగంతో వెళ్లే అవకాశం ఉంటుంది.
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫీచర్లతో స్కూటర్ ను కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు మాత్రం ఈ స్కూటర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల్లో ఈ స్కూటర్ కు సంబంధించిన షోరూంలు ఉన్నాయి.