Pawan Kalyan Will be Next Chief Minister: ప్రజాస్వామ్యంలో ఏదీ అసాధ్యం కాదు. ఏదీ శాశ్వతం కాదు. పైగా ఓ సామెత ఉంది. ‘ఏమో గుర్రం ఎగరా వచ్చు’. నిజమే.. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా ముఖ్యమంత్రి అవ్వవచ్చు. అసలు జనసేన ప్రయాణం ఎలా సాగుతుంది, భవిష్యత్తు ఫలితాలు ఎలా ఉంటాయి వంటి వాటిని పక్కన పెడితే.. ఏపీలో ఉన్న పరిస్థితులు పవన్ కి భవిష్యత్తులో అనుకూలించవచ్చు.
రాబోయే పదేళ్లలో జగన్ కి పోటీ ఇచ్చే సరైన నాయకుడు కనబడటం లేదు, ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. కానీ, పవన్ కళ్యాణ్ రానున్న పదేళ్ళలో జనసేన అధికారంలోకి రావడానికి బాగా కసరత్తు చేయాల్సి ఉంది. పార్టీ బలోపేతం అవ్వాలంటే..గ్రౌండ్ లెవల్ క్యాడర్ ను ఏకం చేసి ఒకటిగా నడపాల్సి ఉంది.
అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలు తగ్గించి, పాదయాత్ర ప్రారంభిస్తే, బలమైన పార్టీగా జనసేన ఎదిగే అవకాశం ఉంది. అలాగే జనసైనికులు తొందరపాటు ప్రకటనలు మానితే, ప్రజాదరణ పొందుతారు. అన్నిటి కంటే ముఖ్యంగా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే వచ్చే పదేళ్ళలో పవన్ గొప్ప నాయకుడిగా జనం గుండెల్లో స్థానం సంపాదించవచ్చు.
అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా కావచ్చు. కాకపోతే, ఒక రాజాకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే.. కుల సమీకరణలు ముఖ్య పాత్ర వహిస్తాయి కాబట్టి, పవన్ ఆ రకంగానూ ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలు వేసుకోవడం ఉత్తమం. పవన్ కళ్యాణ్ నిజంగానే మంచి క్రేజ్ ఉన్న, అశేష ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో.
ఫ్యాన్స్ కి ఎమోషన్స్ తప్ప లాజిక్స్ ఉండవు. పూల దండలు, పాలభిషేకాలు వంటి వాటికే వాళ్ళను పరిమితం చేయకుండా.. రాజకీయంగానూ వారిని పార్టీలోకి తీసుకువస్తే.. ఒక నమ్మకమైన క్యాడర్ జనసేన పార్టీకి శాశ్వతంగా ఉండిపోతుంది.