కొడాలి నాని.. తెలుసుకొని మాట్లాడు.. ఇదీ మోడీ రామభక్తి

విడిచిన బాణం.. నోటి నుంచి జారిన మాట వెనక్కి తీసుకోలేం. అందుకే ఎక్కడైనా ఎప్పుడైనా జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయాల్లో ఉన్న వారైతే ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి. లేకుంటే తలరాతలే మారిపోతాయి. ఏలికలు కాస్తా రాజకీయ చదరంగంలో బానిసలుగా మారిపోతారు. Also Read: బీజేపీ నేతల అరెస్టు.. ఏపీలో ఉద్రిక్తత ఇప్పుడు జగన్ సర్కార్ అభాసుపాలు కావడానికి.. బూతు రాజ్యంగా పేరుపొందడానికి.. భ్రష్టుపట్టడానికి ఒక్క ఏపీ మంత్రి కొడాలి నాని చాలు అని బీజేపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. […]

Written By: NARESH, Updated On : September 24, 2020 5:09 pm
Follow us on

విడిచిన బాణం.. నోటి నుంచి జారిన మాట వెనక్కి తీసుకోలేం. అందుకే ఎక్కడైనా ఎప్పుడైనా జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయాల్లో ఉన్న వారైతే ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి. లేకుంటే తలరాతలే మారిపోతాయి. ఏలికలు కాస్తా రాజకీయ చదరంగంలో బానిసలుగా మారిపోతారు.

Also Read: బీజేపీ నేతల అరెస్టు.. ఏపీలో ఉద్రిక్తత

ఇప్పుడు జగన్ సర్కార్ అభాసుపాలు కావడానికి.. బూతు రాజ్యంగా పేరుపొందడానికి.. భ్రష్టుపట్టడానికి ఒక్క ఏపీ మంత్రి కొడాలి నాని చాలు అని బీజేపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇటీవల ప్రధాని మోడీ గురించి మాట్లాడిన కొడాలి నాని కాస్త జనరల్ నాలెడ్జ్ పెంచుకొని మాట్లాడితే బెటర్ అని సూచిస్తున్నారు.

తాజాగా ప్రధాని మోడీపై ఏపీ మంత్రి కొడాలి నాని నోరుజారారు. శ్రీవారిని జగన్ పాటు దర్శించుకున్న మంత్రి నాని ‘బీజేపీ కింది స్థాయి నాయకుల వైఖరితోనే మోడీ బజారున పడుతున్నారని.. ముందు నరేంద్రమోడీని సతీసమేతంగా ఆలయాలకు రమ్మని’ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయోధ్య భూమిపూజలో భార్య తోడు లేకుండా మోడీ ఎలా భూమి పూజ చేస్తారని మంత్రి నాని ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టాకే ఏపీలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని పరుష విమర్శలు చేశారు.

అయితే అయోధ్యలో భూమి పూజ వేళ ప్రధాని నరేంద్రమోడీ సతీసమేతంగా రాకుండా భూమి పూజ చేశారనే కోణంలో మంత్రి నాని విమర్శలు చేశారు.కానీ అయోధ్య భూమిపూజ శాస్త్రోక్తంగానే జరిగిందని బీజేపీ నేతలు ఘంఠా బజాయించి చెబుతున్నారు.

అయోధ్య లో భూమి పూజను అసలు మోడీ చేతుల మీదుగా జరగలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. దివంగత వీహెచ్.పీ నేత అశోక్ సింఘాల్ తమ్ముడు సలిల్ సింఘాల్ ఆయన భార్య మధు సింఘాల్ ముఖ్య యజమానులుగా ఈ పూజ నిర్వహించారని ఫొటోలు చూపించి మరి వివరిస్తున్నారు.. భూమి పూజలు ఏదైనా సరే మన శాస్త్రం ప్రకారం.. భార్య సమేతంగా చేయాలి. అందుకే మోడీ ఇందులో ముఖ్య భూమిక పోషించలేదు. సలిల్ సింఘాల్ ఆయన భార్య మధు సింఘాల్ ముఖ్య యజమానులుగా శాస్త్రోక్తంగా ఈ భూమి పూజను నిర్వహించారు.

Also Read: ఏపీ మంత్రిపై వచ్చిన ఆరోపణలు నిజమేనా?

ఈ కార్యక్రమాన్ని కేవలం మోడీతోపాటు స్టేజ్ మీద ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ , యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ కూర్చొని తిలకిస్తూ పాలుపంచుకున్నారు. అంతేకానీ మోడీ ప్రధాన యజమానిగా ఈ తంతు జరగలేదు.

ఇప్పటికైనా ప్రధాని నరేంద్రమోడీపై నోరుజారిన మంత్రి నాని క్షమాపణ చెప్పాలని.. లేకుంటే ఊరుకునేది లేదని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఈ రోజు ఏపీ వ్యాప్తంగా మంత్రి నాని వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతలు ఆందోళనలు కూడా చేశారు. ఇప్పటికైనా కాస్త ఇంగితంతో మంత్రి నాని మాట్లాడితే బాగుంటుందని బీజేపీ నేతలు హితవు పలుకుతున్నారు.