డ్రగ్స్ కేసులో నమ్రత.. మీడియా సృష్టేనా?

  హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య మిస్టరీగా మారిన సంగతి తెల్సిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా.. లేదా ఎవరైనా హత్య చేశారా? అనేది తేల్చాల్సిన పోలీసులు పక్కదారి పడుతున్నారు. ఈ కేసులో డ్రగ్స్ లింకులు బయటపటడంతో రంగంలోకి దిగిన సీబీఐ, ఎన్సీబీ ఆ దిశగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. సస్పెన్స్ థిల్లర్ ను తలపించేలా ఈ కేసులో రోజు ట్వీస్టు వెలుగు చూస్తోంది. Also Read: కశ్యప్ పై ఆరోపణ.. తాప్సీ హాట్ కామెంట్స్ […]

Written By: NARESH, Updated On : September 24, 2020 5:16 pm
Follow us on

 

హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య మిస్టరీగా మారిన సంగతి తెల్సిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా.. లేదా ఎవరైనా హత్య చేశారా? అనేది తేల్చాల్సిన పోలీసులు పక్కదారి పడుతున్నారు. ఈ కేసులో డ్రగ్స్ లింకులు బయటపటడంతో రంగంలోకి దిగిన సీబీఐ, ఎన్సీబీ ఆ దిశగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. సస్పెన్స్ థిల్లర్ ను తలపించేలా ఈ కేసులో రోజు ట్వీస్టు వెలుగు చూస్తోంది.

Also Read: కశ్యప్ పై ఆరోపణ.. తాప్సీ హాట్ కామెంట్స్

సుశాంత్ ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. ఈ కేసులో డ్రగ్స్ లింకులు బయటపడగా తీగలాగితే డొంక కదిలిన చందంగా బాలీవుడ్లోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ అరెస్టయ్యారు. వీరితో డ్రగ్స్ డీలర్లు బాసిత్, శశాంక్ లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.

ఈ కేసును సీబీఐ, ఎన్సీబీ విచారణ చేస్తుండగా మరోవైపు జాతీయ మీడియా సైతం పలు కీలక సమాచారాన్ని సేకరిస్తోంది. రోజుకో కథనం మీడియాలో ప్రసారం చేస్తూ అందరి అటెన్షన్స్ తనవైపు తిప్పుకుంటోంది. ఈ క్రమంలో రియా చక్రవర్తి డ్రగ్స్ సంబంధం ఉన్న 25మంది సెలబ్రెటీల పేర్లు వెల్లడించినట్లు కథనాలను ప్రసారం చేసింది.

ఇందులో భాగంగా పలువురి పేర్లను తెరపైకి తీసుకొస్తోంది. ఈ కేసుతో సంబంధం లేని పలువురి హీరోయిన్లు, సెలబ్రెటీల పేర్లను మీడియా కావాలనే ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పేరును డ్రగ్స్ కేసుతో లింకు చేస్తూ ఓ జాతీయ ఛానల్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయ సాహాతో వాట్సాప్ చేసినట్లు సదరు సంస్థ వార్తలను వడ్డించింది. వీరిద్దరి సంభాషణకు చాటింగ్ నార్కోటిక్స్ కంట్రోల్ వద్ద ఉన్నాయంటూ సదరు ఛానల్ ఊహాగానం చేస్తూ వార్తలను ప్రసారం చేసింది.

Also Read: సుశాంత్ ఆత్మహత్య.. బయటపడుతున్న డర్టీ సిక్రెట్స్.!

అయితే ఛాటింగులో ఏముందనేది మాత్రం చెప్పలేదు. దీంతో కేవలం టీఆర్పీ కోసమే సదరు మీడియా ఇలాంటి బోగస్ కథనాలు ప్రసారం చేస్తుందని ఆమె అభిమానులు మండిపడుతున్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా వార్తా కథనాలు ప్రసారం చేయడం మంచిదని కాదని హితవు పలుకున్నారు. డ్రగ్స్ కేసును విచారిస్తున్న దర్యాప్తు సంస్థ ఎలాంటి ప్రకటన చేయకముందే కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో తమకు తోచిన విధంగా కథనాలను ప్రచురించడంపై సినీప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.