https://oktelugu.com/

బాలయ్య సినిమా అంటే భయపడుతున్న హీరోలు !

నట సింహం బాలయ్య బాబు హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో ఒక యంగ్ హీరో పాత్ర కూడా ఉంది. అది బాలయ్య అసిస్టెంట్ పాత్ర, జస్ట్ అసిస్టెంట్ రోల్ అయినా, ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ రోల్ కాస్త కీలకమైనది అని.. అందుకే కొంచెం ఫేమ్ ఉన్న హీరో అయితే బెటర్ అని ఈ రోల్ కోసం మొదట నవీన్ పొలిశెట్టిని తీసుకుందామనుకున్నారు. ఆ తరువాత అల్లరి నరేష్ ను […]

Written By:
  • admin
  • , Updated On : September 24, 2020 / 03:51 PM IST
    Follow us on


    నట సింహం బాలయ్య బాబు హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో ఒక యంగ్ హీరో పాత్ర కూడా ఉంది. అది బాలయ్య అసిస్టెంట్ పాత్ర, జస్ట్ అసిస్టెంట్ రోల్ అయినా, ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ రోల్ కాస్త కీలకమైనది అని.. అందుకే కొంచెం ఫేమ్ ఉన్న హీరో అయితే బెటర్ అని ఈ రోల్ కోసం మొదట నవీన్ పొలిశెట్టిని తీసుకుందామనుకున్నారు. ఆ తరువాత అల్లరి నరేష్ ను తీసుకోవాలని అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. సినిమాలో బాలయ్య పాత్ర తాలూకు యాక్టివిటీస్ అన్ని ఆ యంగ్ హీరో పాత్ర కోసమే ఆధారపడి ఉంటాయని, అందుకే నాని లాంటి హీరో అయితేనే సినిమా నిలబడుతుందని బోయపాటి ఫీల్ అవుతున్నాడట.

    Also Read: ఐశ్వర్యారాయ్ కుమార్తెగా జాన్వి కపూర్ !

    మరి నాని, బాలయ్య సినిమాలో నటించడానికి ఒప్పుకుంటారా అంటే అనుమానమే. పోనీ ఫామ్ లో ఉన్న మిగిలిన ఎవరేజ్ హీరోలను చూసుకుంటే.. విజయ్ దేవరకొండ, నిఖిల్, శర్వానంద్ లాంటి హీరోలు ఉన్నా.. మరి వీరిలో బాలయ్య సినిమాలో అసిస్టెంట్ పాత్ర చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. కాకపోతే బోయపాటి శ్రీనును చూసైనా ఎవరో ఒకరు ఒప్పుకుంటారని అనుకుంటున్నారు. కానీ బాలయ్య సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి ఫామ్ లో ఉన్న ఏ హీరో ముందుకు రాని పరిస్థితినే ఉందనేది ఇప్పటికే బోయపాటికి అర్ధం అయిపొయింది. ఏ హీరోని కదిలించినా సైలెంట్ గా తప్పించుకు తిరుగుతున్నారట అందుకే నవీన్ పొలిశెట్టిని తీసుకోవడమే ఇక బెటర్ అప్షన్ ఏమో.

    Also Read: ప్లాప్ సినిమాలకి బెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ !

    ఇక ఈ సినిమా టీజర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ అండ్ దుమ్ము రేపే యాక్షన్ తో అభిమానులను బాగానే ఆకట్టుకున్నా.. ఎప్పటిలాగే అది రొటీన్ గానే సాగింది. మరి సినిమా కూడా అలాగే రొటీన్ యాక్షన్ డ్రామాగా ఉంటే.. జనం విసిగిపోవడం ఖాయం. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా.. మ్యూజిక్ సెన్సేషనల్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్లాప్ లతో బాధ పడుతున్న బాలయ్యకు ‘సింహ’ ‘లెజెండ్’ రూపంలో పెద్ద హిట్స్ ఇచ్చిన బోయపాటి, మరి ఈ సారి కూడా అలాంటి సూపర్ హిట్ నే ఇస్తాడేమో చూడాలి.