https://oktelugu.com/

రాజమౌళితో మహేష్ బాబు సినిమా మరింత ఆలస్యం?

మహేష్ బాబుతో సినిమా ఉంటుందని దర్శకధీరుడు రాజమౌళి ప్రకటించినప్పటి నుండి ఈ కాంబినేషన్ గురించి అభిమానుల నుండి సాధారణ ప్రేక్షకుల వరకు అమితాసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ‘ఆర్ఆర్ఆర్’ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తూ రాజమౌళి ఫుల్ బిజీ గా ఉన్నారు. జక్కన్న తరువాత మూవీ మహేష్ బాబుతోనే ఉంటుందని తెలిసినప్పటికీ కానీ ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు పూర్తయ్యి ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని రకరకాల అనుమానాలు ఉన్నాయి. […]

Written By:
  • admin
  • , Updated On : February 7, 2021 / 04:56 PM IST
    Follow us on


    మహేష్ బాబుతో సినిమా ఉంటుందని దర్శకధీరుడు రాజమౌళి ప్రకటించినప్పటి నుండి ఈ కాంబినేషన్ గురించి అభిమానుల నుండి సాధారణ ప్రేక్షకుల వరకు అమితాసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ‘ఆర్ఆర్ఆర్’ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తూ రాజమౌళి ఫుల్ బిజీ గా ఉన్నారు. జక్కన్న తరువాత మూవీ మహేష్ బాబుతోనే ఉంటుందని తెలిసినప్పటికీ కానీ ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు పూర్తయ్యి ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని రకరకాల అనుమానాలు ఉన్నాయి.

    Also Read: సలార్ మూవీలో విలన్ ఫిక్స్… ఎవరంటే?

    ఈ అనుమానాలకు బలపరిచే కారణాలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల అక్టోబర్ 13 న అని ప్రకటించారు. కాబట్టి రాజమౌళి వైపు నుండి మహేష్ మూవీ ఈ సంవత్సరం పట్టాలెక్కటం కష్టమే. అలాగే మహేష్ బాబు ప్రస్తుతం పరుశరాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సంవత్సర కాలం సినిమా షూటింగ్స్‌కు దూరంగా ఉంటూ, కుటుంబ సభ్యులతోనే గడిపిన మహేష్… రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ ఉంటుందని ప్రకటించారు.

    Also Read: ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నోరు జారిన చిరంజీవి

    పరుశురాం సినిమా తర్వాత అనిల్ రావిపూడితో ఒక సినిమా కమిట్మెంట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ తర్వాత కూడా త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ లలో ఎవరొకరితో సినిమా చేశాకనే మహేష్-రాజమౌళి మూవీ ఉంటుందట. ఎందుకంటే… జక్కన్న ఎలాగూ మూవీని రెండు మూడేళ్లు చెక్కుతాడు కనుక ముందుగానే ఈ ప్రాజెక్ట్స్ ని పూర్తి చేయాలని మహేష్ ఆలోచిస్తున్నారని సన్నిహిత వర్గాలలో టాక్ నడుస్తుంది. సో… యావత్‌ సినిమా ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న వీరిద్దరి మూవీ ఇప్పట్లో ఉండదని అర్ధమవుతుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్