కీర్తి సురేష్ తాజాగా నటించిన చిత్రం ‘మిస్ ఇండియా’. ఎన్నో అంచనాల మధ్య ‘మిస్ ఇండియా’ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫిక్స్ లో విడుదలైంది. లేడి ఓరియేంటెడ్ మూవీ ‘మిస్ ఇండియా’ తెరకెక్కింది. కీర్తి సురేష్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలువగా పూజిత పొన్నాడ, నదియ, జగతిపతిబాబు, నవీన్ చంద్ర, రాజేంద్రప్రసాద్, నరేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
మిస్ ఇండియా సినిమా గురించి వస్తే ఒక మధ్యతరగతి అమ్మాయి(మానస సంయుక్త) చిన్నతనం నుంచే బిజినెస్ ఉమెన్ గా రాణించాలని కల కంటుంది. వాటిని నెరవేర్చుకునేందుకు ఆమె అమెరికా వెళుతోంది. అక్కడే ఆమె మిస్ ఇండియా అనే చాయ్ బిజినెస్ పెడుతుంది. అయితే ఆమెకు ప్రత్యర్థి(జగపతి బాబు) ఇబ్బందులు పెడుతుంటాడు. దీనిని ఆమె ఎలా ఎదుర్కొని రాణించిందనేది సినిమాలో చూపించారు.
Also Read: డైహార్ట్ ఫ్యాన్ కోరిక తీర్చిన ఎన్టీఆర్
కీర్తిసురేష్ తన పాత సినిమాల్లో మాదిరిగానే మిస్ ఇండియాలోనూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆమె స్లిమ్ కావడంతో కొత్త కన్పించింది. కీర్తి సురేష్ తల్లిగా నదియ, తండ్రిగా నరేష్, అన్నగా కమల్ కామరాజు, తాతయ్య రాజేంద్రప్రసాద్ నటించారు. అదేవిధంగా జగతిపతి బాబు, నవీన్ చంద్ర తమ పాత్రలకు న్యాయం చేశారు.
అయితే సినిమా చూస్తున్నంతసేపు చాలా స్లోగా కథ నడుస్తుందన్న ఫీలింగ్ కలుగుతుంది. మొయిన్ పాయింట్ ఎలివేట్ కాకుండా పూర్తి రొటీన్ గా స్క్రీన్ ప్లే సాగింది. దర్శకుడు నరేంద్రనాధ్ కథకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నప్పటికీ ఆకట్టుకునేలా తీయడంలో పూర్తిగా సక్సక్ కాలేదు. ఫస్ట్ పార్టులో కొన్ని సీన్స్ బోర్ కొట్టగా సెకండ్ ఆఫ్ లో చాలా సీన్స్ సాగతీసినట్లు కన్పించాయి.
Also Read: రానా, కోహ్లీ, ప్రకాష్ రాజ్ కు షాక్.. హైకోర్టు నోటీసులు
తమన్ మ్యూజిక్ పర్వలేదనిపించింది. కెమెరామెన్ పనితనం బాగుంది. క్వాలిటీపరంగా విజువల్ పరంగా దర్శకుడు సినిమాను ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. సినిమాలో ఎడిటింగ్ పెద్దగా ఆకట్టుకోలేదు. ల్యాగ్ సీన్స్ ఎడిట్ చేయకుండానే బోర్ ఫీల్ అయ్యేలా చేశాడు. నిర్మాత మహేశ్ కొనేరు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇప్పటివరకు ఓటీటీల్లో రిలీజైన సినిమాల మాదిరిగానే మిస్ ఇండియా కూడా ప్లాప్ జాబితాలోకి వెళ్లిందనే టాక్ విన్పిస్తోంది.