మానవాళిని కరోనా మహమ్మారి గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ అదుపులోకి వచ్చిందని పలు దేశాలు చెబుతున్నా ఇప్పట్లో వైరస్ ను అదుపు చేయడం సాధ్యం కాదని.. వైరస్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సెకండ్ లాక్ డౌన్ తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ గురించి ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
తాజాగా శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ ను సంబంధించి అదిరిపోయే శుభవార్త చెప్పారు. యూనివర్శిటీ ఆఫ్ వాషింఘ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు సూక్ష్మ కణాలతో తాము కరోనా వ్యాక్సిన్ ను తయారు చేశామని.. ఈ వ్యాక్సిన్ ను ఎలుకలపై ప్రయోగించగా మంచి ఫలితాలను సాధించామని తెలిపారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఎలుకల్లో వైరస్ ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఏకంగా పది రెట్లు పెరిగిందని తెలిపారు.
ఈ వ్యాక్సిన్ లో వైరస్ ను సులువుగా గుర్తించగలిగేలా మెమొరీ సెల్స్ ను కూడా తయారు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో శాస్త్రవేత్తలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు సక్సెస్ అయినా ఫ్రీజర్లలో భద్రపరచాల్సి ఉంటుందని అయితే తమ వ్యాక్సిన్ ను ఫ్రీజర్ లో భద్రపరచాల్సిన అవసరం కూడా లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బయోకెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నీల్ కింగ్ ఐదో వంతు డోస్ నే ఎలుకలకు ఇచ్చామని తెలిపారు.
Also Read: ఏపీలో పాఠశాలలో కరోనా కలకలం.. టెన్షన్ లో విద్యార్థులు..?
‘సెల్’ జర్నల్ లో ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన వివరాలను, ఫలితాలను పొందుపరిచారు. ఈ కరోనా వ్యాక్సిన్ రోగ నిరోధక శక్తికి సంబంధించిన బీ సెల్స్ లో సైతం అభివృద్ధిని కనబరుస్తూ ఉండటం గమనార్హం. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం రెండు బయోటెక్ కంపెనీలను గుర్తించారు. అయితే ఈ కంపెనీలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.