https://oktelugu.com/

కేసీఆర్ నిర్ణయం జగన్ చావుకొచ్చింది.!

ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఏపీ సీఎం జగన్ ను తీవ్రంగా ఇరుకునపెట్టింది.. 2014లో గెలిచాక కేసీఆర్ పథకాలు ప్రవేశపెడితే నాటి ఏపీ సీఎం చంద్రబాబు కాపీ కొట్టి అమలు చేసేవాడు. కానీ జగన్ సీఎం అయ్యాక దేశంలోనే గొప్ప పథకాలు ప్రవేశపెడుతూ కేసీఆర్ నే ఇరుకునపెడుతున్నాడు. Also Read: ఏపీలో యువతదే కీరోల్‌.: ఇక బీజేపీ దృష్టి వారి మీదనే.. అయితే తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం […]

Written By:
  • NARESH
  • , Updated On : January 22, 2021 / 10:53 AM IST
    Follow us on

    ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఏపీ సీఎం జగన్ ను తీవ్రంగా ఇరుకునపెట్టింది.. 2014లో గెలిచాక కేసీఆర్ పథకాలు ప్రవేశపెడితే నాటి ఏపీ సీఎం చంద్రబాబు కాపీ కొట్టి అమలు చేసేవాడు. కానీ జగన్ సీఎం అయ్యాక దేశంలోనే గొప్ప పథకాలు ప్రవేశపెడుతూ కేసీఆర్ నే ఇరుకునపెడుతున్నాడు.

    Also Read: ఏపీలో యువతదే కీరోల్‌.: ఇక బీజేపీ దృష్టి వారి మీదనే..

    అయితే తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019లో అమలు చేసిన అగ్రవర్ణాల్లోని పేదలకు(ఈడబ్ల్యూఎస్) 10శాతం రిజర్వేషన్లు ఇప్పుడు తెలంగాణలోనూ అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అయితే ఏపీలో మాత్రం జగన్ ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి సిద్ధంగా లేరు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్  కొత్త రిజర్వేషన్లు అమలు కారణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. రిజర్వేషన్లు అందుకుంటున్న సామాజికవర్గాల్లో అనుమానాలు, భయాలు ఉన్నాయి. అన్నింటికంటే మించి వీరంతా వైసీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న వారే.. దీంతో కొత్త రిజర్వేషన్ల అమలుకు ప్రయత్నిస్తే వారి నుంచి వ్యతిరేకత తప్పదని జగన్ భయపడి ఈ రిజర్వేషన్లకు దూరంగా ఉన్నారు.

    Also Read: ఫీ‘జులుం’పై సర్కార్ సీరియస్

    ఇప్పటికే ఏపీ బీజేపీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏపీలో అమలు చేయాలని పోరుబాటు పట్టింది. గవర్నర్ కు ఫిర్యాదులు చేసింది. ఇప్పుడు దీన్ని ఎన్నికల అస్త్రంగా కూడా మార్చే అవకాశాలు ఆలోచిస్తోంది. దీంతో ఈ ప్రత్యేక రిజర్వేషన్లను అమలు చేస్తామనో.. త్వరలో నిర్ణయం తీసుకుంటామనో.. అధ్యయనం చేస్తున్నామనో ఏదో ఒకటి చెప్పాల్సిన పరిస్థితి జగన్ సర్కార్ కు తలెత్తింది.

    జగన్ కనుక త్వరపడకపోతే ప్రతిపక్షాలన్నీ టార్గెట్ చేసే అవకాశం ఉంది. మరి ఈ పరిణామాలను జగన్ ఎలా ఎదుర్కొటాడు.? ఓటు బ్యాంకు కోసం అగ్రవర్ణాల రిజర్వేషన్లు అమలు చేయడా? అన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తం కేసీఆర్ నిర్ణయం నిజంగానే జగన్ ను ఇరుకునపడేసిందనే చెప్పాలి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్