హిట్ సినిమాని ఎవ్వరూ ఆపలేరు

ఈ సంక్రాంతికి మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు, ఒక తమిళ అనువాద చిత్రం పోటీ పడ్డాయి. ఆ పోటీలో ‘క్రాక్’ యునానిమస్ హిట్ ‌గా నిలిచి.. మొత్తానికి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. అయితే నిజానికి క్రాక్ కి ఎన్నో సమస్యలు, మొదటి రోజు సినిమానే రిలీజ్ అవ్వలేదు. ఆ తరువాత సినిమా రిలీజ్ అయినా థియేటర్లు దొరకలేదు. మొత్తానికి ఆ వివాదం తాలుకు ఫలితం ఇన్నాళ్ళకు దక్కేలా ఉంది. క్రాక్ మూవీ విషయంలో నైజాం డిస్ట్రిబ్యూటర్లు […]

Written By: admin, Updated On : January 22, 2021 11:03 am
Follow us on


ఈ సంక్రాంతికి మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు, ఒక తమిళ అనువాద చిత్రం పోటీ పడ్డాయి. ఆ పోటీలో ‘క్రాక్’ యునానిమస్ హిట్ ‌గా నిలిచి.. మొత్తానికి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. అయితే నిజానికి క్రాక్ కి ఎన్నో సమస్యలు, మొదటి రోజు సినిమానే రిలీజ్ అవ్వలేదు. ఆ తరువాత సినిమా రిలీజ్ అయినా థియేటర్లు దొరకలేదు. మొత్తానికి ఆ వివాదం తాలుకు ఫలితం ఇన్నాళ్ళకు దక్కేలా ఉంది. క్రాక్ మూవీ విషయంలో నైజాం డిస్ట్రిబ్యూటర్లు శిరీష్ రెడ్డి కి, వరంగల్ శ్రీనుకు మధ్య నెలకొన్న వివాదం చాంబర్ మెట్లు ఎక్కింది.

Also Read: ట్రైలర్ టాక్ : ‘౩౦ రోజుల్లో ప్రేమించడం ఎలా’ !

క్రాక్ కు రేపటి నుంచి థియేటర్లు ఇవ్వడంలో జరుగుతున్న తెరవెనుక రాజకీయం పై నిర్మాత మధు నిర్మాతల కౌన్సిల్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఇక తప్పనిసరిగా రాజు థియేటర్లు ఇస్తున్నాడు. అయినా తెలుగు సినిమాలకు ఆ నలుగురే పెద్ద దిక్కు అని ఇన్నాళ్లు ఇలా ఎంతమంది ఎన్ని ఆరోపణలు చేసినా మిగిలిన పెద్దలు పట్టించుకొలేదు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇంకా ఎంతమంది బాధ పడాల్సి వస్తోందో. నిజానికి దిల్ రాజు ‘రెడ్, అల్లుడు అదుర్స్, మాస్టర్’ సినిమాలను తీసుకున్నాడు.

Also Read: భార్య పుట్టినరోజు జరిపేందుకు మహేష్ బాబు ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే?

అందుకే దిల్ రాజు నైజాంలోని థియేటర్స్ ‌ లో తనే సినిమాలే వేసుకున్నాడు. కాకపోతే పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా వచ్చిన క్రాక్ సినిమా మాస్ ఆడియన్స్‌ కు బాగా కనెక్ట్ అయింది. వరుస ఎలివేషన్ సీన్లతో గోపీచంద్ మలినేని, రవితేజను బాగానే డీల్ చేశాడు. దాంతో ‘క్రాక్’ హిట్ టాక్ తెచ్చుకుంది. ధియేటర్లన్నీ ఆ నలుగురు చేతిలోనే ఉన్నా.. క్రాక్ కి థియేటర్లు ఇవ్వాల్సి వచ్చింది. ఏది ఏమైనా హిట్ సినిమాని ఎవ్వరూ ఆపలేరు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్