https://oktelugu.com/

మోడీ బాటలో కేసీఆర్.. 75 ఏళ్ల స్వాతంత్య్ర పండుగకు పెద్దపీట

సీఎం కేసీఆర్ ఎప్పుడు తొడగొడుతాడో.. ఎప్పుడు పడగొడుతాడో ఎవ్వరికి అర్థం కాదు. ఎందుకంటే ఆయన అడుగులు అలా పడుతుంటాయి. మోడీతో అప్పుడే కయ్యానికి కాలుదువ్వుతాడు.. అప్పుడే కౌగిలించుకుంటాడు. రాజకీయంగా కేసీఆర్ వేసే స్టెప్పులు ఓ పట్టాన అర్థం కావంటారు. తాజాగా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ టీఆర్ఎస్ ను ఓడించిన బీజేపీపై యుద్ధమే ప్రకటించారు. రైతుల ఆందోళనకు మద్దతుగా మంత్రులను రోడ్డెక్కించి బీజేపీకి షాకిచ్చారు. Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేటీఆర్ ‘ఉక్కు’ మంత్రం అయితే తాజాగా […]

Written By:
  • NARESH
  • , Updated On : March 12, 2021 / 12:17 PM IST
    Follow us on

    సీఎం కేసీఆర్ ఎప్పుడు తొడగొడుతాడో.. ఎప్పుడు పడగొడుతాడో ఎవ్వరికి అర్థం కాదు. ఎందుకంటే ఆయన అడుగులు అలా పడుతుంటాయి. మోడీతో అప్పుడే కయ్యానికి కాలుదువ్వుతాడు.. అప్పుడే కౌగిలించుకుంటాడు. రాజకీయంగా కేసీఆర్ వేసే స్టెప్పులు ఓ పట్టాన అర్థం కావంటారు.

    తాజాగా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ టీఆర్ఎస్ ను ఓడించిన బీజేపీపై యుద్ధమే ప్రకటించారు. రైతుల ఆందోళనకు మద్దతుగా మంత్రులను రోడ్డెక్కించి బీజేపీకి షాకిచ్చారు.

    Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేటీఆర్ ‘ఉక్కు’ మంత్రం

    అయితే తాజాగా మోడీ 75 ఏళ్ల స్వాతంత్ర్య పండుగ ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుండడం.. ఆ కమిటీలో కేసీఆర్ కు చోటు కల్పించడంతో తెలంగాణ సీఎం సైతం ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు.

    తాజాగా నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలను ఘనంగా ప్రారంభించారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. 2022 ఆగస్టు 15 వరకు ఆజాదీకా అమృత్ మహోత్సవాలు జరుగనున్నాయి.

    Also Read: కేటీఆర్ కు రాములమ్మ దిమ్మతిరిగే కౌంటర్

    స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోడీ, సీఎంలు ఈరోజు వేడుకలకు శ్రీకారం చుట్టారు. స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు ప్రాణత్యాగాలు చేశారని.. 20 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమ సమయంలోనూ నా సహచరులతో గాంధీ వ్యూహరచననే స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించానని కేసీఆర్ తెలిపారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    అహింసా యుతంగా గాంధీ మార్గంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. అద్భుతపోరాటంగా పరిగణిమించిందని కేసీఆర్ అన్నారు.