తెలంగాణలో పార్టీ పెడతానని వైఎస్ తనయ షర్మిల ప్రకటించారు. సహజంగా వచ్చే రాజకీయ విమర్శలు వచ్చాయి.. సద్దుమణిగాయి. కానీ.. ఆమె మాత్రం తన పనుల్లో సీరియస్ గా నిమగ్నం అయిఉన్నారు. పార్టీ నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ పకడ్బందీగా చేపడుతున్నారు.
Also Read: ఏబీఎన్ ను పగబట్టిన కరోనా..
ఇప్పటికే జిల్లాల వారీగా వైఎస్ అభిమానులుగా ఉన్న ప్రధాన నాయకుల జాబితా సేకరించారు. వారిని తమ కొత్త పార్టీలోకి ఆహ్వానించడానికి ప్రయత్నా చేస్తున్నారు. ఈ పనులన్నీ ప్రధాన అనుచరుడు పిట్టా రాంరెడ్డికి అప్పగించారు షర్మిల. దీంతో.. ఆయన తన టీమ్ తో కలిసి ఆపరేషన్ మొదలు పెట్టారు. అది ఎంత వరకు సక్సెస్ అవుతుంది? అనే విషయం పక్కనపెడితే.. ప్రయత్నాలు మాత్రం గట్టిగానే చేస్తున్నారు.
ఇప్పటికే.. పలువురు నేతలకు స్వయంగా ఫోన్ చేసి, పార్టీలోకి రావాలని కోరుతున్నారట. వీరిలో మెజారిటీ కాంగ్రెస్ కు చెందినవారే ఉన్నారు. హస్తం పార్టీలో చాలా కాలంగా ఉండి, తగిన ప్రాధాన్యత లభించక ఎదురు చూస్తున్నవారిని సంప్రదిస్తున్నారట. వీరిలో ముఖ్యమైన, బలమైన నాయకులకు స్వయంగా వైఎస్ విజయలక్ష్మి ఫోన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
Also Read: ట్రంపు.. కంపు.. అమెరికా అత్యంత చెత్త అధ్యక్షుడు ఇతడేనంటా…
ఈ ప్రయత్నాలు ఇటు చేస్తూనే.. మండల స్థాయిలో పార్టీ నిర్మాణం చేపడుతున్నారట. ఇందులో మొదటి దశగా.. ఒక్కో మండలానికి ముగ్గురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారట. ఈ నెల 16లోపు ఈ మండల కమిటీల నిర్మాణం పూర్తవ్వాలనే లక్ష్యంతో ఉన్నారట. ఏప్రిల్ 9న షర్మిల పార్టీ పేరుతోపాటు, జెండాను ఆవిష్కరించనున్నారు.
పార్టీ పేరు ముందునుంచీ ప్రచారంలో ఉన్నట్టే.. వైఎస్ఆర్‌టీపీ అని తెలుస్తోంది. ఇక జెండా కూడా మూడు రంగులతో సిద్ధం చేస్తున్నారట. మొత్తానికి షర్మిల పార్టీ ఏర్పాటు విషయంలో దూకుడుగా ముందుకెళ్తున్నారు. మరి, ఈ పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుంది? తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? అన్నది చూడాలి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్