https://oktelugu.com/

స్పందిస్తే.. వేటాడేస్తరు.. సెలబ్రెటీలను భయపెడుతున్న ప్రభుత్వాలు..

విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలవడం లేదంటూ.. కొంతమంది టాలీవుడ్ సెలబ్రెటీలపై సోషల్ మీడియా వేదికగా.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. కాగా.. అమెరికా బ్లాక్ లైవ్స్ విషయం దగ్గరి నుంచి తమిళనాడు జల్లికట్టు వరకు టాలీవుడ్ స్టార్లు స్పందించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై మాత్రం దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం అదే భయం.. ప్రభుత్వాలు టార్గెట్ చేస్తాయని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తే స్టార్లు ప్రశాంతంగా ఉంటారా అన్నది వారి మదిలో మెదులుతున్న ప్రశ్న. […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 12, 2021 / 12:18 PM IST
    Follow us on


    విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలవడం లేదంటూ.. కొంతమంది టాలీవుడ్ సెలబ్రెటీలపై సోషల్ మీడియా వేదికగా.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. కాగా.. అమెరికా బ్లాక్ లైవ్స్ విషయం దగ్గరి నుంచి తమిళనాడు జల్లికట్టు వరకు టాలీవుడ్ స్టార్లు స్పందించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై మాత్రం దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం అదే భయం.. ప్రభుత్వాలు టార్గెట్ చేస్తాయని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తే స్టార్లు ప్రశాంతంగా ఉంటారా అన్నది వారి మదిలో మెదులుతున్న ప్రశ్న.

    Also Read: ఏబీఎన్ ను పగబట్టిన కరోనా..

    కాగా.. టాలీవుడ్ స్టార్లకు తెలుగు ప్రజలు అంటే చాలా ఇష్టం. వారి సమస్యల్లో పాలు పంచుకోవాలని అనుకుంటారు. కానీ వారి అభిప్రాయాన్ని చెప్పకుండా అణగదొక్కుకుంటారు. ఎందుకంటే.. తాము కొంత మందికి వ్యతిరేకంగా తయారు అవుతామనే భావన. జాతీయ.. అంతర్జాతీయ అంశాలపై స్పందించడం వేరు.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై స్పందించడం వేరు. ఇక్కడ అమరావతికి మద్దతు తెలిపితే.. ప్రభుత్వానికి టార్గెట్ అవుతామనే భయం ఉంటుంది. విశాఖ స్టీల్ ఉద్యమానికి మద్దుగా ఉంటే.. కేంద్రానికి టార్గెట్ అవుతామని ఆందోళన ఉంటుంది. అందుకే వారు స్పందించలేకపోతున్నారు.

    రైతు ఉద్యమానికి మద్దతు తెలిపిన బాలీవుడ్ సెలబ్రెటీలపై ఐటీ దాడులు జరిపిన మీడియాలో చేసిన అతి ప్రచారం అంతా ఇంతాకాదు. అలాంటి పరిస్థితులు మాకేందుకని టాలీవుడ్ ప్రముఖులు సైలెంట్ గా ఉంటున్నారు. ఇది తెలిసి కూడా రైతు సమస్యలపై సినిమాలు తీసి.. హిట్ కొట్టారని.. అయితే అదే రైతు సమస్యలపై సైలెంటు అయ్యారని ఎక్కువ మంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంటు ఉద్యమం పైనా అదే పరిస్థితి. రేపు ప్రభుత్వాల నుంచి ఏమైనా కష్టాలు వస్తే.. ప్రజలు అండగా ఉండే పరిస్థితి లేదు. కుల, మతాలకు అనుకూలంగా చీలిపోయిన సమాజం ఐక్యతను ఎప్పుడో దూరం చేసింది. అందుకే స్టార్లు తమ జాగ్రత్తలో వారు ఉన్నారు.

    Also Read: ట్రంపు.. కంపు.. అమెరికా అత్యంత చెత్త అధ్యక్షుడు ఇతడేనంటా…

    స్పందించలేదని స్టార్లను నిందించడం సరికాదు. అది వారిష్టం. ప్రభుత్వాలకు భయపడి సైలెంట్ గా ఉండడం అనేది ఇతర సినీ పరిశ్రమల్లో స్టార్లు చేరు. తమిళనాడులో విజయ్ ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా.. గళమెత్తుతూనే ఉంటారు. అందుకే ఆయనను దళపతిగా ఫ్యాన్స్ పిలుస్తుంటారు. ఇప్పుడు ఇమేజ్ అనేది సినిమాల్లో చేసే పాత్ర ద్వారానే కాదు.. నిజ జీవితంలో ప్రజలకు అండగా నిలబడే శైలిని బట్టికూడా వస్తుంది. అయితే రాజకీయ ఆంక్షలు ఉన్నవారు మాత్రమే ఇప్పుడు భయట పడుతున్నారు. రాజకీయాల్లోకి రావాలనుకున్నవాళ్లు మాత్రమే స్పందిస్తున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్