బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు విరుగుడుగా.. కేసీఆర్ పదవుల పందేరం..!

దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఫలితాలతో తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తేటతెల్లమైంది. అదేక్రమంలోనే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ అవతరించిందనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లారు. తెలంగాణలో ఎదురులేకుండా దూసుకెళుతున్న కారుకు బీజేపీ స్పీడు బ్రేక్ వేయడంతో అందరి అడుగులు కమలంవైపు పడుతున్నాయి. అధికార పార్టీలోని అసంతృప్తి నేతలతోపాటు కాంగ్రెస్.. ఇతర పార్టీల నేతలంతా బీజేపీలోకి క్యూ కడుతున్నారు. Also Read: టీ-కాంగ్రెస్ లో భస్మాసుర హస్తాలు..! 2023 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా పావులు […]

Written By: Neelambaram, Updated On : December 13, 2020 4:42 pm
Follow us on

దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఫలితాలతో తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తేటతెల్లమైంది. అదేక్రమంలోనే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ అవతరించిందనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లారు.

తెలంగాణలో ఎదురులేకుండా దూసుకెళుతున్న కారుకు బీజేపీ స్పీడు బ్రేక్ వేయడంతో అందరి అడుగులు కమలంవైపు పడుతున్నాయి. అధికార పార్టీలోని అసంతృప్తి నేతలతోపాటు కాంగ్రెస్.. ఇతర పార్టీల నేతలంతా బీజేపీలోకి క్యూ కడుతున్నారు.

Also Read: టీ-కాంగ్రెస్ లో భస్మాసుర హస్తాలు..!

2023 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ సైతం తెలంగాణ వ్యాప్తంగా ఆపరేషన్ ఆకర్ష్ మొదలైంది. దీంతో ఆ పార్టీలోకి కొద్దిరోజులుగా పెద్దఎత్తున వలసలు మొదలయ్యాయి.

బీజేపీకి ఆకర్ష్ కు విరుగుడుగా సీఎం కేసీఆర్ నామినేటేడ్ పదవుల భర్తీకి జనవరిలో శ్రీకారం చుట్టబోతున్నారు. టీఆర్ఎస్ నేతలను కట్టడి చేయడంలో భాగంగానే సీఎం కేసీఆర్ నామినేటేడ్ పదవుల భర్తీ చేపబోతున్నారనే టాక్ విన్పిస్తోంది.

టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అత్యవసరమైన నామినేటేడ్ పోస్టుల భర్తీ మినహాయించి మిగతా వాటిని భర్తీ చేయలేదు. 2018 ఎన్నికల సమయంలో నామినేటెడ్ పదవులకు రాజీనామాలు చేసిన వారిలో 10మందికి మాత్రమే రెన్యువల్ చేశారు.

త్వరలోనే నామినేటేడ్ పోస్టులు భర్తీ చేయనుండటంతో మొత్తం 64 కార్పొరేషన్లలో మరో 50వరకు నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉంది. మంత్రి పదవి ఆశించి భంగపడిన, ఎన్నికల్లో ఓటమి చెందిన నేతలంతా ఈ పదవులపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు.

Also Read: ఢిల్లీలో సిద్ధిపేట ఎయిర్ పోర్టు గురించి మరిచిపోయారా..?

ఎస్సీ.. ఎస్టీ.. బీసీ.. ఎంబీసీ.. ఆర్టీసీ లాంటి కార్పోరేషన్ పదవులతోపాటు కీలకమైన ప‌బ్లిక్ స‌ర్వీసు క‌మిష‌న్ చైర్మన్ తోపాటు ఇతర సభ్యులు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు ఇటీవలే హైకోర్టు మ‌హిళా క‌మిష‌న్‌ నియ‌మించాల‌ని ఆదేశించింది.

టీఆర్ఎస్ నేతలు బీజేపీ వైపు వెళ్లకుండా ముందస్తుగానే నామినేటేడ్ పదవుల పంపకానికి కేసీఆర్ తెరలేపారు. ఇప్పటికే అన్ని జిల్లాల నేతల బయోడేటాను కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

వీరితోపాటు ఉద్యమ సమయంలో పనిచేసిన కొంతమంది తమకు అవకాశం కల్పించాలని సీఎంను కోరుతున్నారు. నామినేటేడ్ పదవులపై జ‌న‌వ‌రి రెండో వారంలో ప్రక‌ట‌న చేసే అవకాశం ఉందని సమాచారం.

ఓ వైపు బీజేపీ ప్రభావం.. మరోవైపు పార్టీలోని నేతల ఒత్తిడి నేపథ్యంలో గులాబీ బాస్ నామినేటేడ్ పదవులను ఎలా భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్