https://oktelugu.com/

ఆధ్యాత్మిక కేంద్రంగా విశాఖ..?

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం పర్యాటక ప్రాంతాలకు నెలవు. బీచ్, స్టీల్ ప్లాంట్, అరకు.. ఇలా ఎన్నో ప్రాంతాలకు కేంద్రమైన విశాఖలో విహారానికి చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. ఇలాంటి విశాఖను.. ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా మలిచేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు తగిన కార్యాచరణను కూడా రూపొందించింది. Also Read: ఏపీ ‘లోకల్ వార్’: సర్కారు కొత్త వ్యూహం ఇదే! వెంకన్న కోవెల.. విశాఖలో తిరుమల తిరుపతి వెంకన్న ఆలయాన్ని నిర్మించేందుకు టీటీడీ ఇప్పటికే రెడీ అయింది. సాగర […]

Written By: , Updated On : December 13, 2020 / 03:41 PM IST
Follow us on

Visakhapatnam as a spiritual center
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం పర్యాటక ప్రాంతాలకు నెలవు. బీచ్, స్టీల్ ప్లాంట్, అరకు.. ఇలా ఎన్నో ప్రాంతాలకు కేంద్రమైన విశాఖలో విహారానికి చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. ఇలాంటి విశాఖను.. ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా మలిచేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు తగిన కార్యాచరణను కూడా రూపొందించింది.

Also Read: ఏపీ ‘లోకల్ వార్’: సర్కారు కొత్త వ్యూహం ఇదే!

వెంకన్న కోవెల..
విశాఖలో తిరుమల తిరుపతి వెంకన్న ఆలయాన్ని నిర్మించేందుకు టీటీడీ ఇప్పటికే రెడీ అయింది. సాగర తీరాన ఉన్న రుషికొండ వద్ద ఈ ఆలయ నిర్మాణం పనులు ఇపుడు చురుకుగా సాగుతున్నాయి. 28 కోట్ల రూపాయలతో భారీ ఎత్తున నిర్మించనున్న ఈ ఆలయం తిరుమలను పోలి ఉంటుంది. రానున్న రోజులలో భక్తులకు మరో తిరుమలగా మారనుంది. ఈ ఆలయ నిర్మాణ ఏర్పాట్లను తాజాగా పరిశీలించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. విశాఖవాసులకు ఈ ఆలయం ఆధ్యాత్మిక ధామంగా ఉంటుందని అన్నారు.

Also Read: అన్నదాతకు సాయమేదీ? ఆత్మహత్యలు చేసుకుంటున్న పట్టించుకోరా?

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చేతుల మీదుగా ఈ ఆలయం ప్రారంభించనున్నారు. విశాఖవాసులకు ఇది అరుదైన ఆధ్యాత్మిక సంపదగా కూడా ఉంటుందనడంలో సందేహం లేదు. విశాఖను ఇప్పటికే.. పాలనారాజధానిగా చేసిన వైసీపీ సర్కార్ ఇపుడు ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్