కేసీఆర్ వరాలు.. వ్యతిరేకత తగ్గుతుందా?

తెలంగాణలో కొద్దిరోజులుగా టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఫలితాలే వీటికి సాక్ష్యాలుగా మారాయి. ఈక్రమంలో టీఆర్ఎస్ ఫలితాలపై సమీక్ష నిర్వహించుకొని దిద్దుబాటు చర్యలను చేపడుతోంది. దుబ్బాకలో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం.. గ్రేటర్లో ఎక్స్ ఆఫిషియో ఓట్లను కలుపుకున్నా టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించులేకపోవడం ఆ పార్టీకి అవమానకరంగా మారాయి. ఈ ఫలితాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ అలర్ట్ అయినట్లు కన్పిస్తోంది. టీఆర్ఎస్ వ్యతిరేక వర్గాలను క్రమంగా మచ్చిక చేసుకొనే పనిలో […]

Written By: Neelambaram, Updated On : December 30, 2020 12:10 pm
Follow us on

తెలంగాణలో కొద్దిరోజులుగా టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఫలితాలే వీటికి సాక్ష్యాలుగా మారాయి. ఈక్రమంలో టీఆర్ఎస్ ఫలితాలపై సమీక్ష నిర్వహించుకొని దిద్దుబాటు చర్యలను చేపడుతోంది.

దుబ్బాకలో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం.. గ్రేటర్లో ఎక్స్ ఆఫిషియో ఓట్లను కలుపుకున్నా టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించులేకపోవడం ఆ పార్టీకి అవమానకరంగా మారాయి. ఈ ఫలితాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ అలర్ట్ అయినట్లు కన్పిస్తోంది.

టీఆర్ఎస్ వ్యతిరేక వర్గాలను క్రమంగా మచ్చిక చేసుకొనే పనిలో భాగంగా ఆయా వర్గాలకు కొద్దిరోజులుగా కేసీఆర్ వరాలను ప్రకటిస్తున్నారు. అయితే రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే సీఎం కేసీఆర్ ఆయా వర్గాలకు తాయిళాలను ప్రకటిస్తున్నట్లుగా కన్పిస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగాలకు వేతనాల పెంపు.. పదవీ విరమణ వయస్సు పెంపు.. నిరుద్యోగులకు త్వరలో 50వేల ఉద్యోగాల ప్రకటన.. నియంత్రిత సాగువిధానం.. ఎల్ఆర్ఎస్ ఎత్తివేత వంటివన్నీ కూడా దీనిలో భాగమేనని తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయమైనా దానికో రీజన్ ఉంటుందని ఆ పార్టీ నేతలే కామెంట్ చేస్తున్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు.. వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్.. నాగార్జునసాగర్ ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే నిర్ణయాలు తీసుకుంటున్నారనే టాక్ విన్పిస్తోంది.

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసిన కొన్నివర్గాలను దారిలో తెచ్చుకునేందుకు కేసీఆర్ ఇటీవల వరాలు కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ ప్రకటనలను ప్రజలు నమ్మడం లేదని తెలుస్తోంది.

గతంలోనూ కేసీఆర్ ఎన్నో వరాలను ప్రకటించినా అందులో కొన్ని మాత్రమే ఆచరణకు నోచుకున్నాయి. ఈ కారణంగానే కేసీఆర్ తాజాగా ప్రకటిస్తున్న వరాలను కొందరు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

కేసీఆర్ వరాలు ఆచరణలోకి వస్తే తప్పా ఆయావర్గాలు ప్రభుత్వానికి సానుకూలంగా మారే అవకాశం లేదని టాక్ విన్పిస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్ మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.