ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. వచ్చే ఏడాది మూడు డీఎస్సీలు..?

2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే స్థానాలలో, 22 ఎంపీ స్థానాలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలు, 2.70 లక్షల గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలు కల్పించిన జగన్ సర్కార్ వచ్చే ఏడాది మూడు డీఎస్సీలను నిర్వహించి టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనుందని సమాచారం. 2021 సంవత్సరంలో జగన్ సర్కార్ రెగ్యులర్ డీఎస్సీతో పాటు స్పెషల్ డీఎస్సీ, లిమిటెడ్ […]

Written By: Navya, Updated On : December 30, 2020 11:46 am
Follow us on


2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే స్థానాలలో, 22 ఎంపీ స్థానాలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలు, 2.70 లక్షల గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలు కల్పించిన జగన్ సర్కార్ వచ్చే ఏడాది మూడు డీఎస్సీలను నిర్వహించి టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనుందని సమాచారం.

2021 సంవత్సరంలో జగన్ సర్కార్ రెగ్యులర్ డీఎస్సీతో పాటు స్పెషల్ డీఎస్సీ, లిమిటెడ్ డీఎస్సీలను నిర్వహించనుందని తెలుస్తోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో జగన్ సర్కార్ గత డీఎస్సీలోని ఖాళీలను భర్తీ చేయడానికి అనుమతులు ఇవ్వగా కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది డీఎస్సీ నిర్వహణ కుదరలేదు. ఈ ఉద్యోగాల భర్తీ కోసం 2021 సంవత్సరం డిసెంబర్ నెలలో లిమిటెడ్ డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుందని తెలుస్తోంది.

ఈ నోటిఫికేషన్ తో స్పెషల్ డీఎస్సీ ద్వారా స్పెషల్ బీఈడీ చేసిన వారికి పరీక్షలు జరగనున్నాయి. దివ్యాంగ విద్యార్థులకు బోధన కోసం స్పెషల్ డీఎస్సీని అధికారులు నిర్వహించనున్నారు. అయితే స్పెషల్ బీఈడీ చేసిన వాళ్లకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో ఈ ఉద్యోగాలకు అందరూ దరఖాస్తు చేయలేరు. ఈ డీఎస్సీలతో పాటు నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న రెగ్యులర్ డీఎస్సీని ప్రభుత్వం నిర్వహించనుంది.

మొదట టెట్ పరీక్ష నిర్వహించి అధికారులు ఆ తరువాత డీఎస్సీ నిర్వహించనున్నారు. గతంతో పోలిస్తే ఈసారి టెట్ పరీక్షలో ఇంగ్లీష్ కు వెయిటేజీ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. గతంలో టెట్ కు 20 శాతం వెయిటేజీ ఇవ్వగా ఈసారి ఎంత వెయిటేజీ ఇవ్వనున్నారో తెలియాల్సి ఉంది.