https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ టీజర్ లోని హైలైట్స్ !

నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్సకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నుండి మరో రెండు రోజుల్లో తారక్ ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ అవుతుండటంతో.. అందరూ ఎలాంటి వీడియో రిలీజ్ అవుతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చరణ్ కు సంబంధించిన, బీమ్ ఫ‌ర్ రామ‌రాజు వీడియో రిలీజ్ చేసి మెగా అభిమానులతో పాటు యావత్తు ప్రేక్షక లోకానికి జ‌క్క‌న్న మంచి ట్రీట్ ఇవ్వడం.. పైగా ఆ […]

Written By:
  • admin
  • , Updated On : October 21, 2020 / 02:14 PM IST
    Follow us on


    నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్సకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నుండి మరో రెండు రోజుల్లో తారక్ ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ అవుతుండటంతో.. అందరూ ఎలాంటి వీడియో రిలీజ్ అవుతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చరణ్ కు సంబంధించిన, బీమ్ ఫ‌ర్ రామ‌రాజు వీడియో రిలీజ్ చేసి మెగా అభిమానులతో పాటు యావత్తు ప్రేక్షక లోకానికి జ‌క్క‌న్న మంచి ట్రీట్ ఇవ్వడం.. పైగా ఆ వీడియోలో చ‌ర‌ణ్‌ను ఓ రేంజ్‌లో చూపించ‌డం, అన్నిటికి మించి ఆ వీడియోలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ హైలైట్ అవ్వడంతో ఇప్పుడు ఎన్టీఆర్ వీడియో ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఆసక్తి రెట్టింపు అయింది.

    Also Read: ‘రాధేశ్యామ్’ సర్ ప్రైజ్ వచ్చేసింది.. ప్రభాస్ సీడీపీ వైరల్..

    కాగా చరణ్ పై వచ్చిన టీజర్ లో ఎన్టీఆర్ కేవలం తన వాయిస్ ఓవర్ తోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు, మరి ఇప్పుడు రామరాజు ఫర్ భీమ్ పేరుతో రాబోయే ప్రత్యేక వీడియోలో ఎన్టీఆర్ తన యాక్షన్ తో ఏ రేంజ్ లో సర్ ప్రైజ్ చేస్తాడో చూడాలి. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ వీడియోలో చరణ్ వాయిస్‌ ఓవర్ ఉండదని తెలుస్తోంది. ఈ టీజర్ లో ఎన్టీఆర్ నే స్వయంగా కొన్ని పవర్ ఫుల్ డైలాగ్‌లను చెబుతారని.. అలాగే పులితో ఎన్టీఆర్ ఫైట్ కి సంబంధించిన విజువల్స్ ను కూడా ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నారని.. ఓవరాల్ గా ‘ఎన్టీఆర్’ సర్ ప్రైజ్ వీడియోలో ఇవే మెయిన్ హైలైట్స్ గా నిలివబోతున్నాయని తెలుస్తోంది.

    Also Read: చిరంజీవి కోసం వినాయక్ అంతపని చేశాడా?

    ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ జనరేషన్ లో మొదటిసారి టాలీవుడ్ లోని రెండు పెద్ద కుటుంబాలకు చెందిన ఇద్దరు బడా స్టార్స్ ఒకే సినిమాలో కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా కోసం సినిమా ఇండస్ట్రీ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఎలాగూ రాజమౌళి విజువల్ సెన్స్ పై కామన్ ఆడియన్స్ కి అపారమైన నమ్మకం కలగడంతో నేషనల్ వైడ్ గా కూడా ఫుల్ క్రేజ్ ఉంది ఈ సినిమాకు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్, అలాగే ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.