రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై కేసీఆర్ సమాలోచన.. సుప్రీంకు వెళుతారా?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ను విజయవంతం చేయాలని శతవిధలా పని చేస్తోంది. అయితే వ్యవసాయ.. వ్యవసాయతేర ఆస్తుల వివరాలను ప్రభుత్వం ఈ పోర్టల్లో అనుసంధానించడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతోన్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. Also Read: ‘రైతుబంధు’కు మరొక అవకాశం..! ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భాగంగా ఆధార్ వివరాలు.. కులం.. కుటుంబ సభ్యులు వివరాలను సేకరించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. […]

Written By: Neelambaram, Updated On : December 18, 2020 8:26 pm
Follow us on

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ను విజయవంతం చేయాలని శతవిధలా పని చేస్తోంది. అయితే వ్యవసాయ.. వ్యవసాయతేర ఆస్తుల వివరాలను ప్రభుత్వం ఈ పోర్టల్లో అనుసంధానించడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతోన్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు.

Also Read: ‘రైతుబంధు’కు మరొక అవకాశం..!

ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భాగంగా ఆధార్ వివరాలు.. కులం.. కుటుంబ సభ్యులు వివరాలను సేకరించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం సాఫ్ట్ వేర్ ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్.. పీటీఐఎన్ నిలిపివేయాలని సూచించింది.

అంతేకాకుండా కులం.. కుటుంబ సభ్యుల వివరాలు తొలగించాలని ఆదేశాలిచ్చింది. హైకోర్టు తీర్పు ప్రకారంగా రిజిస్ట్రేషన్లు కొనసాగించుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 28కి వాయిదా వేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతుందనే టాక్ విన్పిస్తోంది.

Also Read: ఆన్ లైన్ అప్పు.. ఆయువును మింగేస్తుందా?

దీనిపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ రేపు సీఎస్ తోపాటు రెవెన్యూ ఉన్నతాధికారులతో సమీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీ ఇంకా ప్రభుత్వానికి అందలేదని తెలుస్తోంది.

దీంతో హైకోర్టు కాపీ అందిన తర్వాత దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ భావిస్తుున్నారు. రేపటి సమావేశంలో దీనిపై కూలంకషంగా చర్చించి హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లడమా? లేదా అని తేల్చనున్నారనే ప్రచారం జరుగుతోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్