https://oktelugu.com/

శశికళ విడుదలకు ముహూర్తం ఖరారు

ఇన్నాళ్లు జైలు గోడలకే పరిమితమైన అన్నా డీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ విడుదలకు రంగం సిద్ధమైంది. నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న జయలలిత నెచ్చెలి.. చిన్నమ్మ జైలు జీవితం వీడి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైంది. వచ్చే ఏడాది జనవరి 27న ఆమె విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో శిక్ష అనుభవించిన శశికళ అక్క కొడుకు సుధాకరన్ ఇప్పటికే జరిమానా చెల్లించడంతో అతని విడుదలకు కూడా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. […]

Written By: , Updated On : December 18, 2020 / 12:26 PM IST
Follow us on

Sasikala
ఇన్నాళ్లు జైలు గోడలకే పరిమితమైన అన్నా డీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ విడుదలకు రంగం సిద్ధమైంది. నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న జయలలిత నెచ్చెలి.. చిన్నమ్మ జైలు జీవితం వీడి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైంది. వచ్చే ఏడాది జనవరి 27న ఆమె విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో శిక్ష అనుభవించిన శశికళ అక్క కొడుకు సుధాకరన్ ఇప్పటికే జరిమానా చెల్లించడంతో అతని విడుదలకు కూడా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శశికళ కంటే ముందుగానే సుధాకరన్.. ఇవాళో రేపో బయటికి రానున్నారు.

Also Read: ‘రైతుబంధు’కు మరొక అవకాశం..!

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషులుగా తేలడంతో శశికళ, ఆమె వదిన ఇళవరసి, అక్క కుమారుడు సుధాకర్‌ 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వీరి శిక్షాకాలం 2017 ఫిబ్రవరితో ముగియనుంది. గతనెల 17న శశికళ తన జరిమానాను న్యాయవాది ద్వారా బెంగళూరు సిటీ సివిల్‌ కోర్టులో చెల్లించారు. ఆ తరువాత ఇళవరసి సైతం జరిమానాను చెల్లించారు. వీఎన్‌ సుధాకరన్‌ మాత్రం జరిమానా చెల్లించకపోవడంతో గురువారం బెంగళూరు సివిల్‌ కోర్టులో హైడ్రామా నడిచింది. చివరికి రూ.10 కోట్ల జరిమానా సొమ్ము చెల్లించడంతో సుధాకరన్‌ విడుదలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అక్రమ ఆస్తుల కేసులో శిక్ష అనుభవించిన సుధాకరన్‌ విడుదలపై స్పష్టత రావడంతో అదే కేసుకు చెందిన శశికళకు సైతం జైలు నుంచి విముక్తి పొందే రోజు ఆసన్నమైనట్లు తెలుస్తోంది. విచారణ ఖైదీగా శశికళ గడిపిన జైల్లో గడిపిన రోజులను పరిగణనలోకి తీసుకుని వచ్చే ఏడాది జనవరి 27వ తేదీ రాత్రి 7 లేదా 9.30 గంటలకు శశికళ విడుదల ఖాయమని సమాచారం.

Also Read: కాంగ్రెస్ ప్రక్షాళన.. సోనియా సంచలనం?

తమిళనాడులో వచ్చే ఏడాది మేలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శిశకళ విడుదలకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. ఆమె అడుగు బయటపెట్టిన వెంటనే.. మోస్ట్ పవర్ ఫుల్ ‘మన్నార్ గుడి మాఫియా’ మళ్లీ జీవం పోసుకుంటుందని, ఈసారి ఎన్నికల్లో రచ్చ తప్పదనే చర్చ నడుస్తోంది. జైలు శిక్ష ముగియడం, రూ.10 కోట్ల జరిమానాను ఇప్పటికే చెల్లించి ఉండటంతో శశికళ విడుదలకు ఆటంకాలేవీ ఉండబోవని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లే జరిగిన వచ్చే ఏడాది జనవరి 27న ఆమె విడుదల కావడం ఖాయం. చిన్నమ్మ బెంగళూరులోని జైలు నుంచి బయటికి అడుగుపెట్టి, తమిళనాడులోకి వెళ్లేంతవరకు చేపట్టాల్సిన బందోబస్తు చర్యలపై కర్ణాటక ప్రభుత్వం గురువారం జారీ చేసిన సర్క్యులర్‌ జారీ చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్