https://oktelugu.com/

తారక్‌ భీమ్‌ టీజర్‌‌ రికార్డు

డైరెక్టర్‌‌ రాజమౌళి అంటేనే.. తెలుగు సినిమా బ్రాండ్‌. ఇక ఆయన దర్శకత్వంలో సినిమా వస్తోందంటే అభిమానుల పండుగలాంటి వార్తే. అందులోనూ మల్టీస్టారర్‌‌ మూవీ అంటే దానికి వచ్చే క్రేజీ అంతా ఇంతా కాదు. ఇప్పటికే బాహుబలితో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్‌ చేసిన రాజమౌళి.. మరో భారీ మల్టీస్టారర్‌‌ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ తారక్‌, మెగా పవర్ స్టార్‌‌ రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దాని పేరే ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’. Also Read: దిల్ రాజ్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 18, 2020 / 12:38 PM IST
    Follow us on


    డైరెక్టర్‌‌ రాజమౌళి అంటేనే.. తెలుగు సినిమా బ్రాండ్‌. ఇక ఆయన దర్శకత్వంలో సినిమా వస్తోందంటే అభిమానుల పండుగలాంటి వార్తే. అందులోనూ మల్టీస్టారర్‌‌ మూవీ అంటే దానికి వచ్చే క్రేజీ అంతా ఇంతా కాదు. ఇప్పటికే బాహుబలితో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్‌ చేసిన రాజమౌళి.. మరో భారీ మల్టీస్టారర్‌‌ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ తారక్‌, మెగా పవర్ స్టార్‌‌ రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దాని పేరే ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’.

    Also Read: దిల్ రాజ్ ఫంక్షన్ కు నందమూరి హీరోలు ఎందుకు రాలేదు?

    ఈ మధ్యే ‘రౌద్రం రణం రుధిరం’ టీజర్‌‌ రిలీజ్‌ అయింది. బాగా ఆకలితో ఉన్న పులికి సరైన జింక దొరికితే ఎలా ఉంటుందో అలా తారక్ అభిమానులుకు కొమరం భీం టీజర్ దొరికింది. కొన్నాళ్ల నిరీక్షణకు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడిక్ చిత్రంలో కొమరం భీంగా నటిస్తున్న తారక్ నుంచి వచ్చిన ఈ టీజర్ తో భారీ రికార్డులను అభిమానులు సెట్ చేశారు.

    మన తెలుగు నుంచి కనీ వినీ ఎరుగని యూనానిమస్ రికార్డులను టీజర్ వచ్చిన ప్రతీ నిమిషం నుంచి స్టార్ట్ చేశారు. అది ఒక వ్యూస్ మరియు లైక్స్ విషయంలోనే కాకుండా కామెంట్స్ విషయంలో కూడా నెవర్ బిఫోర్ రికార్డులను నెలకొల్పి సంచలనం సృష్టించారు.

    Also Read: ఆ బిగ్ బాస్ బ్యూటీ దశ తిరిగిందట

    ఈ మధ్యనే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ టీజర్ 5 లక్షల కామెంట్స్ క్రాస్ చేసి ఇండియాలోని మాసివ్ రికార్డును నెలకొల్పింది. ఇప్పుడు అదే తరహాలో అతి తక్కువ గ్యాప్ లో తారక్ పేరిట కూడా ఈ సెన్సేషనల్ రికార్డు నమోదు అయ్యింది. మొత్తానికి మన తెలుగులో తన టీజర్‌‌తో ప్రతీ రికార్డు లెక్కను తారక్ తేల్చేశాడని చెప్పాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్