పవన్ తో కటీఫ్? టీఆర్ఎస్ కు మద్దతుపై అమిత్ షా సీరియస్?

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు మద్దతిస్తూ జనసేనాని పవన్ కళ్యాన్ తీసుకున్న నిర్ణయం చిచ్చు పెట్టింది. ఈ పరిణామం బీజేపీతో జనసేన కటీఫ్ దిశగా సాగుతోందా? అంటే ఔననే అంటున్నాయి పరిణామాలు. ఏపీలో బీజేపీతో పొత్తుతో ముందుకెళుతున్న జనసేనాని పవన్.. తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడి నేతల వ్యాఖ్యలు, అవమానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో జనసేన మద్దతును బీజేపీకి ఇవ్వడం లేదని.. టీఆర్ఎస్ కు ఇస్తున్నట్టు స్పష్టం చేశాడు. తాజాగా హైదరాబాద్ లో […]

Written By: NARESH, Updated On : March 15, 2021 8:50 am
Follow us on

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు మద్దతిస్తూ జనసేనాని పవన్ కళ్యాన్ తీసుకున్న నిర్ణయం చిచ్చు పెట్టింది. ఈ పరిణామం బీజేపీతో జనసేన కటీఫ్ దిశగా సాగుతోందా? అంటే ఔననే అంటున్నాయి పరిణామాలు. ఏపీలో బీజేపీతో పొత్తుతో ముందుకెళుతున్న జనసేనాని పవన్.. తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడి నేతల వ్యాఖ్యలు, అవమానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో జనసేన మద్దతును బీజేపీకి ఇవ్వడం లేదని.. టీఆర్ఎస్ కు ఇస్తున్నట్టు స్పష్టం చేశాడు.

తాజాగా హైదరాబాద్ లో జరిగిన జనసేన ఆవిర్బావ వేడుకల్లో భాగంగా మాట్లాడిన పవన్.. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ సంచలన ప్రకటన చేశాడు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి షాకిచ్చాడు. ‘బీజేపీ కేంద్ర నాయకత్వం జనసేనతో ఉన్నా తెలంగాణ బీజేపీ మా పార్టీని అవమానించింది. జనసేనను చులకన చేసేలా తెలంగాణ బీజేపీ మాట్లాడింది. అందుకే తెలంగాణలో టీఆర్ఎస్ అభ్యర్థి అయిన పీవీ కుమార్తె వాణికి మద్దతిస్తున్నాం. పీవీ ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మహానుభావుడు’ అని పవన్ స్పష్టం చేశారు. ఈ ప్రకటన బీజేపీలో దుమారం రేపింది. బీజేపీతో పవన్ కటీఫ్ దిశగా పయనిస్తున్నాడా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే పవన్ వైఖరి వ్యవహారశైలిపై బీజేపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించి టీఆర్ఎస్ కు మద్దతివ్వడంపై తెలంగాణ బీజేపీ నేతలు సీరియస్ అయ్యి అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో బీజేపీ అధిష్టానం దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టు తెలిసింది. పవన్ కళ్యాణ్ నుంచి దీనిపై వివరణ కోరనున్నారని.. ఆ తర్వాత రెండు పార్టీల పొత్తు భవిష్యత్తులో కొనసాగుతుందా లేదా అనే డౌట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.

తిరుపతి సీటును బీజేపీకి ఇవ్వడం పవన్ కు ఇష్టం లేదని.. పంచాయతీల్లో సత్తాచాటిన జనసేనను కాదని.. బీజేపీ పోటీచేయడంపై పవన్ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఆ కోవలోనే బీజేపీతో కటీఫ్ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ముందుగా తెలంగాణ బీజేపీకి షాకిచ్చి ఆ తర్వాత ఏపీలోనూ కటీఫ్ చేస్తారని అంటున్నారు.