https://oktelugu.com/

కాజల్ నో సీక్రెట్స్.. హనీమూన్ తో సహా అన్నీ చూపిస్తోంది?

టాలీవుడ్లోని అగ్ర కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. రెండు దశాబ్దాలుగా కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో కొనసాగుతూ సౌత్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 35ఏళ్ల ఈ వెటరన్ భామకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. Also Read: కాజల్ – గౌతమ్ హనీమూన్ వెకేషన్ ఫోటోలు కాజల్ అగర్వాల్ నిత్యం తనకు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ఖుషీ చేస్తూ ఉంటుంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 13, 2020 / 09:43 AM IST
    Follow us on

    టాలీవుడ్లోని అగ్ర కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. రెండు దశాబ్దాలుగా కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో కొనసాగుతూ సౌత్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 35ఏళ్ల ఈ వెటరన్ భామకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

    Also Read: కాజల్ – గౌతమ్ హనీమూన్ వెకేషన్ ఫోటోలు

    కాజల్ అగర్వాల్ నిత్యం తనకు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ఖుషీ చేస్తూ ఉంటుంది. ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకొని కొత్తజీవితంలో అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన ప్రతిచిన్న విషయాన్ని కూడా కాజల్ అగర్వాల్ అభిమానులతో పంచుకుంది.

    కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత హానీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. అక్కడే భర్తతో కలిసి రోమన్స్ చేస్తూ అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాజల్ ను గౌతమ్ కిచ్లు వెనుక నుంచి గట్టిగా హాగ్ చేసిన ఫొటోను ఇటీవల షేర్ చేసింది. దీనిని చూసిన ఫ్యాన్స్ డంగై పోతున్నారు. తాజాగా అండర్ వాటర్ రూములో భర్తతో కలిసి రోమాన్స్ చేసిన ఫొటోలను కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

    Also Read: చిరంజీవి కరోనా అప్ డేట్.. ఏమైందంటే?

    హాట్ హాట్ డ్రెస్సులతో కాజల్ అగర్వాల్ కవ్విస్తూ.. భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. గత నాలుగు రోజులుగా కాజల్ అగర్వాల్ తన హానీమూన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. ఈ ఫొటోలపై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. హానీమూన్ ను కాజల్ అగర్వాల్ పబ్లిసిటీ వాడుకోవడంపై మండిపడుతున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో కాజల్ హానీమూన్ కు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి..!

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్