2007 లో `లక్ష్మి కళ్యాణం’ చిత్రం తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ తన పదమూడేళ్ల సినీ ప్రయాణం చాలా బాగా చేసిందనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉండటం అభినందనీయం. ప్రస్తుతం పలు పెద్ద సినిమా ఆఫర్లను అందు కొంటూ ముందుకు సాగుతోంది . ప్రస్తుతం ‘ముంబై సాగా’ అనే మల్టీ స్టారర్ హిందీ సినిమా తో పాటు , కమల్ హాసన్ ప్రెస్టీజియస్ మూవీ `ఇండియన్ 2’ చిత్రం […]
2007 లో `లక్ష్మి కళ్యాణం’ చిత్రం తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ తన పదమూడేళ్ల సినీ ప్రయాణం చాలా బాగా చేసిందనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉండటం అభినందనీయం. ప్రస్తుతం పలు పెద్ద సినిమా ఆఫర్లను అందు కొంటూ ముందుకు సాగుతోంది . ప్రస్తుతం ‘ముంబై సాగా’ అనే మల్టీ స్టారర్ హిందీ సినిమా తో పాటు , కమల్ హాసన్ ప్రెస్టీజియస్ మూవీ `ఇండియన్ 2’ చిత్రం , ` హే సినామికా’ , `పారిస్ పారిస్ ` అనే తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’లో కూడా కథానాయికగా అవకాశం దక్కించుకుంది. అవన్నీ అలావుంటే ఇపుడు మరో భారీ చిత్రం కూడా కాజల్ ని వరించినట్టు తెలుస్తోంది .
తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించే తదుపరి చిత్రం లో కాజల్ హీరోయిన్ గా నాలుగో సారి నటించే ఛాన్స్ దక్కించు కోబోతుంది . త్వరలో మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ ‘తుపాకి 2’ చిత్రం చేయాలను కొంటున్నాడు. కాగా ఇందులో కథానాయికగా కాజల్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంతకు ముందు వచ్చిన ‘తుపాకి’ చిత్రం లో కాజల్ హీరోయిన్ కనుక రెండో భాగం లో కూడా ఆమెనే రిపీట్ చేయాలని మురుగదాస్ అనుకొంటున్నాడట …ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని, త్వరలోనే అఫీషియల్ సమాచారం రాబోతుంది . గతంలో కాజల్, విజయ్ కాంబోలో ” తుపాకీ , ‘మెర్సల్, జిల్లా” అనే మూడు చిత్రాలు రాగా మూడూ కూడా సూపర్ హిట్ అయ్యాయి .