https://oktelugu.com/

నిర్మాతగా టాలెంటెడ్ బ్యూటీ.. గెస్ట్ రోల్ లో కూడా !

సాయి పల్లవి మొదటి నుండి ట్రెడిషినల్ అండ్ హోమ్లీ హీరోయిన్ గానే గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి డీ అనే ప్రోగ్రామ్ తోనే సాయి పల్లవికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి డాన్సర్ గా గుర్తింపు ఉంది. అయితే ఆ గుర్తింపును క్యాష్ చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నాలు మొదలుపెట్టింది. మా టీవీ కోసం డీ లాంటి షో ఒకటి ప్లాన్ చేస్తోంది. ఈ షోకి అనుసంధాన కర్తగా అలాగే నిర్మాతగా కూడా సాయి పల్లవి ఉండబోతోందని తెలుస్తోంది. మరి ఈ […]

Written By:
  • admin
  • , Updated On : August 11, 2020 / 05:14 PM IST
    Follow us on


    సాయి పల్లవి మొదటి నుండి ట్రెడిషినల్ అండ్ హోమ్లీ హీరోయిన్ గానే గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి డీ అనే ప్రోగ్రామ్ తోనే సాయి పల్లవికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి డాన్సర్ గా గుర్తింపు ఉంది. అయితే ఆ గుర్తింపును క్యాష్ చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నాలు మొదలుపెట్టింది. మా టీవీ కోసం డీ లాంటి షో ఒకటి ప్లాన్ చేస్తోంది. ఈ షోకి అనుసంధాన కర్తగా అలాగే నిర్మాతగా కూడా సాయి పల్లవి ఉండబోతోందని తెలుస్తోంది. మరి ఈ షో సరిగ్గా వర్కౌట్ అవ్వకపోతే సాయి పల్లవి కెరీర్ మీదే ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎంత గొప్ప నటి అయినా మనోళ్ళకు నచ్చకపోతే పక్కన పెట్టేయడం తెలుగు సినిమాకి ఆనవాయితీగా వస్తోన్న ఆచారం అయ్యే. ప్రస్తుతం సాయి పల్లవి చైతు లవ్ స్టోరీ మూవీలో మెయిన్ పాత్ర చేస్తోంది.

    Also Read: చిరుతో చరణ్‌ ఫైటింగ్‌…

    అలాగే మరో రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి. ఆయితే ఓ మలయాళ సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేస్తోందట.. తనలోని నాజుకి తనాన్ని మార్చుకుని కాస్త బొద్దు తనానికి మారడానికి తగిన డైట్ ఫాలో అవుతుంది ఈ బ్యూటీ. అన్నట్టు ఈ సినిమాలో బ్లైండ్ క్యారెక్టర్ లో నటించబోతుంది. స్వతహాగా మంచి నటి కావడం, పైగా అలాంటి ఎమోషనల్ క్యారెక్టర్స్ బాగా సూట్ అవ్వడంతో సాయి పల్లవి ఈ బ్లైండ్ క్యారెక్టర్ చేయాలని బాగా తాపత్రయ పడుతుందట. ఇక హీరో నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రీమేక్ కాబోతున్న బాలీవుడ్ సూపర్ హట్ మూవీ ‘అంధాదూన్’లో ఓ గెస్ట్ రోల్ ఉందని.. పెర్ఫార్మెన్స్ కి ఎక్కువ స్కోప్ ఉన్న ఆ రోల్ చాలా కీలకమైనది కావడంతో ఆ రోల్ లో కూడా సాయి పల్లవి నటించనుంది.

    Also Read: సినిమాకు వంద కోట్లు.. దేశంలో ప్రభాస్ ఒక్కడే!

    అయితే సాయి పల్లవి ఈ సినిమా చేయడానికి కారణం మాత్రం హీరో నాని అట. ఆ పాత్ర నువ్వు మాత్రమే చేయగలవు అని మొత్తానికి ఈ టాలెంటెడ్ బ్యూటీని కన్వీన్స్ చేసాడు. అందుకే మెయిన్ హీరోయిన్ గా మంచి సినిమాలు చేతిలో ఉన్నా.. గెస్ట్ రోల్ చేయడానికి ఒప్పుకుంది. కానీ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో నటించడానికి కూడా ఆమె పెద్ద మొత్తంలోనే డబ్బును డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. గెస్ట్ రోల్ అయినా, ప్రధాన పాత్ర కావడంతో.. పైగా కథ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుండటంతో అన్నిటికి మించి ఫామ్ లో ఉండటంతో ఆమె అడిగిన భారీ రెమ్యునిరేషన్ ను ఇచ్చేందుకు మేకర్స్ కూడా ఇంట్రస్ట్ గానే ఉన్నారు.