అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎట్టకేలకు డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపొందారు. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం. బైడెన్ 284 ఓట్లతో మ్యాజిక్ ఫిగర్‌ను దాటి విజయం సాధించారు. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ 214 ఓట్ల వరకే పరిమితమయ్యాడు. గత కొన్ని రోజులుగా అమెరికా ప్రెసిడెంట్ ఎవరనే ఉత్కంఠకు పెన్విల్వేన్వియా ఫలితం తెరదించినట్లయింది. స్వింగ్ రాష్ట్రమైన పెన్విల్వేన్వియాలో బైడెన్ విజయం సాధించడంలో అయనకు అధ్యక్ష పదవి దక్కింది.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు
77 ఏళ్ల బైడెన్ ఇప్పటికే 264 ఓట్లు సాధించి గెలుపు కోసం వేచి చూస్తున్నాడు. అయితే కొన్ని రాష్ట్రాల్లో నువ్వా నేనా అన్నట్లు పోరు సాగింది. ముఖ్యంగా స్వింగ్ రాష్ట్రాలపైనే అందరి దృష్టి పడింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విజయం సాధించిన బైడెన్ పెన్విల్వేన్వియా, జార్జియా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే పెన్విల్వేన్వియా ఫలితం బైడెన్‌కు అనుకూలంగా రావడంతో గెలుపు సునాయాసంగా మారింది.
Also Read: గెలుపు వేళ.. జాతినుద్దేశించి ప్రసంగించిన జోబైడెన్
అమెరికా ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలయిపన్పటి నుంచి పోరు ఉత్కంఠగా సాగింది. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ వివిధ రకాలుగా ప్రచారం చేస్తూ ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే కరోనా విషయంలో ట్రంప్ ప్రవర్తన కొంత వ్యతిరేకత వచ్చిందని తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఈ వైరస్‌ను చాలా తేలికగా తీసుకోవడంతో ప్రపంచంలోనే అత్యధిక మరణాలు అమెరికాలో జరిగాయి. అంతేకాకుండా ట్రంప్‌నకు కరోనా సోకినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలుస్తోంది.
ఇక 50 ఏళ్ల రాజకీయ అనుభవమున్న జో బైడెన్ ఒబామా హాయాంలో ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ముందునుంచే అమెరికా ప్రజలు అవసరాలను తెలుసుకొని వారికి అనుగుణంగా ప్రచారం చేస్తూ వచ్చారు. ముఖ్యంగా కాలుష్యం కారణంగా భూతాపం పెరిగిపోతుండడంత, వాతావరణ మార్పులు తలెత్తడంతో కాలిఫోర్నియా అడవులు తగలబడి పెద్ద ఎత్తున్న ఆస్తి, ప్రాణ నష్టం జరగడం ప్రజలను ఆలోచింపజేసింది. ట్రంప్ రాగానే ప్యారిస్ ఒప్పందం నుంచి వైదలగగా, తాము అధికారంలోకి వస్తే ప్యారిస్ ఒప్పందాన్ని తిరిగి కుదుర్చుకుంటామని బైడెన్ ప్రసంగించడంతో ప్రజలు బైడెన్‌కే ఓటు వేసినట్లు తెలుస్తోంది.
Also Read: గెలుపు లాంఛనమే: వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టనున్న బైడెన్..!
సాధారణంగా అమెరికాలో సంస్థలు జరిపిన సర్వేలకు వ్యతిరేకంగా ఫలితాల వస్తుంటాయి. గత ఎన్నికల్లోనూ హిల్లరీ క్లింటన్ గెలుపు ఖాయమని చెప్పారు. కానీ ఈసారి సర్వే ఫలితాలు నిజమయ్యాయి. మొదటి నుంచి సర్వేలన్నీ బైడెన్ గెలుపునే సూచించాయి. బైడెన్ చేసే ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకోవడంతో పాటు ఎక్కువ శాతం మంది మద్దతు ఆయన కూడగట్టుకున్నాడు.