అమెరికాలో అధ్యక్ష పదవికి అర్హత సాధించిన బైడెన్ గెలుపుపై పలు సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా రెండు రోజుల కిందటే ఆయన 264 ఓట్లు సాధించి మరో ఆరు ఎలక్టోరల్ ఓట్లు కోసం వేచి చూశారు. నిన్న రాత్రి పెన్వెల్వేనియాలో 20 ఓట్లు రావడంతో ఆయన అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. అయితే పెన్వేల్వేనియాలో ఎక్కువగా నల్లజాతీయులు ఉన్నారు. గతంలో ఓ నల్లజాతీయుడిపె స్థానిక పోలీసులు మెడపై కాలుపెట్టడడంతో ఆయన చనిపోయాడు. దీంతో యూఎస్‌లోని నల్లజాతీయులంతా ఒక్కటై నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారులపై ట్రంప్ ఫైరింగ్ చేయించారు. దీంతో అప్పటి నుంచి నల్లజాతీయులు ట్రంప్‌పై ఆగ్రహంగా ఉన్నారు. తాజాగా పెన్వేల్వేనియా ఓట్లు కీలకంగా మారి బైడెన్ వైపు మొగ్గు చూపాయి. దీంతో ఆయన విజయం సాధించారు. అయితే ఈ రాష్ట్రంలోని వారందరినీ ఒక్కతాటిపైకి తేవడంతో మాజీ అధ్యక్షుడు ఒబామా కృషి ఉందని అంటున్నారు.