అమెరికాలో విజయం.. తమిళనాడులో సంబరాలు…

అమోరికా, భారత్‌ మధ్య ఎప్పటికీ సత్సంబంధాలు ఉంటాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా హర్షించదగ్గ విషయమే. కానీ తమిళనాడు రాష్ట్రంలో ఏకంగా సంబరాలు చేసుకుంటున్నారు. అసలు కారణమేంటంటే.. డెమెక్రటిక్‌ పార్టీ నుంచి ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలాహ్యారిస్‌ది తమిళనాడు రాష్ట్రమే. కమలా తల్లి భారత సంతతి మహిళ కాగా తండ్రి జమైకన్‌. అమ్మమ్మ, తాతయ్యల స్వగ్రామాలు తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లాలో ఉన్నాయి. ఆమె తాతయ్య పీవీ గోపాలన్‌ స్వస్థలం తుసేంద్రపురం కాగా.. అమ్మమ్మ రాజమ్‌ పైంగనాడులో […]

Written By: Velishala Suresh, Updated On : November 8, 2020 8:22 am
Follow us on

అమోరికా, భారత్‌ మధ్య ఎప్పటికీ సత్సంబంధాలు ఉంటాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా హర్షించదగ్గ విషయమే. కానీ తమిళనాడు రాష్ట్రంలో ఏకంగా సంబరాలు చేసుకుంటున్నారు. అసలు కారణమేంటంటే.. డెమెక్రటిక్‌ పార్టీ నుంచి ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలాహ్యారిస్‌ది తమిళనాడు రాష్ట్రమే. కమలా తల్లి భారత సంతతి మహిళ కాగా తండ్రి జమైకన్‌. అమ్మమ్మ, తాతయ్యల స్వగ్రామాలు తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లాలో ఉన్నాయి. ఆమె తాతయ్య పీవీ గోపాలన్‌ స్వస్థలం తుసేంద్రపురం కాగా.. అమ్మమ్మ రాజమ్‌ పైంగనాడులో జన్మించింది. మాజీ దౌత్యవేత్త గోపాలన్‌ పెద్ద కుమార్తె శ్యామల సంతానమే కమలా హ్యారిస్‌. ఆమె విజయంతో ఇప్పుడు ఈ గ్రామాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. శనివారం రాత్రి ఫలితాలు వెలువడడంతో ఆదివారం ఆయా జిల్లాలో సంబరాలు చేసుకుంటున్నారు.