https://oktelugu.com/

జోబైడెన్ కు నేడే పట్టాభిషేకం.. ఆయన ముందున్న సవాళ్లు ఇవే?

రాజకీయ నేత కాని.. ప్రజల విలువ తెలియని.. వ్యాపారవేత్త అమెరికా అధ్యక్షుడు అయితే ఎంతటి ఉపద్రవాలు ఎదురవుతాయో తాజాగా డొనాల్డ్ ట్రంప్ పాలనను చూస్తే అర్థం చేసుకోవచ్చు.ట్రంప్ పాలనను అమెరికన్లే కాదు.. ప్రపంచ దేశాలు కూడా చీకొట్టాయి. ఆయనను అమెరికన్లు సాగనంపినా కుర్చీకి వేళాడుతూ చేసిన రచ్చ అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది. కరోనా ఎఫెక్ట్ ను ఎదుర్కోని ట్రంప్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఈ క్రమంలోనే నిరుద్యోగం, పేదరికం, వ్యవస్థలు నాశనమయ్యాయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : January 20, 2021 / 10:29 AM IST
    Follow us on

    M

    రాజకీయ నేత కాని.. ప్రజల విలువ తెలియని.. వ్యాపారవేత్త అమెరికా అధ్యక్షుడు అయితే ఎంతటి ఉపద్రవాలు ఎదురవుతాయో తాజాగా డొనాల్డ్ ట్రంప్ పాలనను చూస్తే అర్థం చేసుకోవచ్చు.ట్రంప్ పాలనను అమెరికన్లే కాదు.. ప్రపంచ దేశాలు కూడా చీకొట్టాయి. ఆయనను అమెరికన్లు సాగనంపినా కుర్చీకి వేళాడుతూ చేసిన రచ్చ అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది. కరోనా ఎఫెక్ట్ ను ఎదుర్కోని ట్రంప్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఈ క్రమంలోనే నిరుద్యోగం, పేదరికం, వ్యవస్థలు నాశనమయ్యాయి. వీటన్నింటిని బాగు చేసే గొప్ప బాధ్యతను భుజాన వేసుకోవడానికి వస్తున్నాడు జోబైడెన్.

    Also Read: ఆ ఆంక్షలు ట్రంప్‌ ఎత్తేసినా.. కుదరదన్న బైడెన్‌

    అమెరికా న46వ అధ్యక్షుడుగా బుధవారం 78ఏళ్ల జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ తో కలిసి అమెరికాను మళ్లీ గాడినపెట్టడానికి రెడీ అవుతున్నారు. ట్రంప్ మరకలను వీరిద్దరూ కడిగేస్తారా? మళ్లీ అమెరికాను ప్రపంచంలోనే గొప్ప దేశంగా నిలబెడుతారా? వారి ముందున్న సవాళ్లు ఏంటనేది ఆసక్తిగా మారింది.

    జోబైడెన్-కమలాహారిస్ జంట ముందర ఉన్న ప్రథమ సవాల్ కరోనా వల్ల కల్లోలమైన అమెరికాను కాపాడడమే. ప్రపంచంలోనే అత్యధికంగా 2.46 కోట్ల మంది అమెరికన్లు కరోనా బారినపడి 4 లక్షలకుపైగా మంది చనిపోయారు. కరోనాను అరికట్టి.. టీకా పంపిణీ చేసి ప్రజలను ఆ మహమ్మారి నుంచి కాపాడడం.. ఆర్థిక పురోగతి… ఉద్యోగాల కల్పన చేయడం ముందున్న సవాల్. కరోనా లాక్ డౌన్ తో కోల్పోయిన వారిందరినీ మళ్లీ తిరిగి పునరుద్దరించేలా చేయాల్సి ఉంటుంది.

    ఇక అమెరికాలో నల్లజాతీయులపై జరుగుతున్న దాడులు.. జాతివివక్షను రూపుమాపడం జోబైడెన్ ముందున్న రెండో కర్తవ్యం. ఇక వాతావరణ ఒప్పందం నుంచి వైదొలిగిన ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరోసారి పారిస్ ఒప్పందంలో భాగస్వామిగా మారి కాలుష్యాన్ని అరికట్టడం జోబైడెన్ విధిగా ఉంది.

    Also Read: బైడెన్‌ టీమ్‌లో ఇద్దరు కాశ్మీరీలు..! : ఫ్యూచర్ ప్లాన్ ఏంటో..?

    ఇప్పటికే మైనస్ లలో ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేసి ఉద్యోగ కల్పనపై దృష్టి సారించడం బైడెన్ ముందున్న కఠిన సవాల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

    ఉద్దీపన ప్యాకేజీలతో ప్రపథంగా జోబైడెన్ కరోనాను నియంత్రించి సగటు ప్రజలు, నిరుద్యోగులు, చిరు వ్యాపారులకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ఇప్పటికే 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు.

    ఇక డెమొక్రాట్లు, రిపబ్లిక్ రాష్ట్రాలన్నింటిని ఏకతాటిపైకి తెచ్చి అమెరికన్ ఫస్ట్ నినాదంతో అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టేందుకు జోబైడెన్ బలంగా సంకల్పించారు. మరి ఆయన ఆశయాలు ఫలిస్తాయా? ఈ మేరకు ముందుకు సాగుతాయా? అన్నది త్వరలోనే తేలనుంది.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు