Homeఎంటర్టైన్మెంట్ట్రైలర్ టాక్: 'సూపర్ ఓవర్' మూవీ

ట్రైలర్ టాక్: ‘సూపర్ ఓవర్’ మూవీ

Super Over Movie
కరోనా మహమ్మారి రాకపోయి ఉంటే.. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ నిజంగా ఇప్పుడు ఉన్న స్థాయిలో అయితే ఉండవు. ఒక విధంగా కరోనా అనేది డిజిటల్ ప్లాట్ ఫామ్స్ రూపురేఖలు మార్చేసింది. వాటి స్తొమత స్థాయిని పెంచేసింది. ఒకపక్క కరోనా దెబ్బకు సినీ ప్ర‌పంచం మెత్తం అత‌లాకుత‌ల‌మైపోతుంటే.. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మాత్రం ఫుల్ కంటెంట్ తో హడావుడిగా ఉన్నాయి.

Also Read: సింగర్ సునీత, ఆమె భర్త రామ్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?

అలాగే అల్లు అరవింద్ కూడా తన ఓటిటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ కోసం డిజిటల్ కంటెంట్‌ను రూపొందించడానికి ఇప్పటికే చాలా మంది దర్శకులతో ప్లాన్ చేస్తూ.. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ ను రిలీజ్ చేస్తూ మొత్తానికి ఆహాని ఆహా అనిపిస్తున్నాడు. ఈ క్రమంలో ”సూపర్ ఓవర్” అనే చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేశారు.

కాగా జనవరి 22న ఆహా యాప్ లో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ని నాగచైతన్య సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి యూనిట్ ని అభినందించారు. ఇక ఈ ‘సూపర్ ఓవర్’ ట్రైలర్ చూస్తుంటే.. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా ఉంది. ఈ సినిమా మెయిన్ పాయింట్ కి వస్తే.. బెట్టింగ్ లకు అలవాటు పడి పోలీస్ స్టేషన్ కు సమీపంలో దొంగతనం చేసిన ముగ్గురు వ్యక్తుల కథలా ఉంది ఇది.

Also Read: క్రిష్ – పవర్ స్టార్ సినిమాకి బ్రేక్ !

కాగా ఆ ముగ్గురు వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నించే మరో ఇద్దరు వ్యక్తుల నేపథ్యంలో ఈ చిత్రం మంచి ఇంట్రస్టింగ్ ట్రీట్మెంట్ తో సరదాగా సాగుతుందని తెలుస్తోంది. ఇక ఈ డిజిటల్ సినిమాలో నవీన్ చంద్ర – చాందిని చౌదరి – అజయ్ – రాకేందు మౌళి – హర్ష ప్రధాన పాత్రల్లో నటించారు. కొత్త దర్శకుడు ప్రవీణ్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ సుధీర్ వర్మ ‘సూపర్ ఓవర్’ చిత్రాన్ని నిర్మించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Super Over Trailer | Naveen Chandra, Chandini Chowdary, Sudheer Varma | An AHA Original

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version