ఎట్టకేలకు పోరుకు సిద్ధమవుతున్న ఉద్యోగ సంఘాలు?

ఉమ్మడి రాష్ట్రంలో హక్కుల కోసం ఉద్యమించిన ఉద్యోగులు స్వరాష్ట్రంలో మాత్రం వాటిని మరిచిపోయినట్లు కన్పిస్తోంది. కొన్నేళ్లుగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నప్పటికీ తమ సమస్యలను మాత్రం పరిష్కరించుకోలేక పోతుండటం శోచీనయంగా మారింది. Also Read: కాంగ్రెస్ కు హ్యండిచ్చి.. బీజేపీలో చేరుతున్న మాజీ మంత్రి..! కొన్నేళ్లుగా ఉద్యోగులు పీఆర్సీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. దీనికితోడు ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన ప్రమోషన్లు.. ట్రాన్స్ ఫర్లు నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతలు […]

Written By: Neelambaram, Updated On : December 17, 2020 3:51 pm
Follow us on

ఉమ్మడి రాష్ట్రంలో హక్కుల కోసం ఉద్యమించిన ఉద్యోగులు స్వరాష్ట్రంలో మాత్రం వాటిని మరిచిపోయినట్లు కన్పిస్తోంది. కొన్నేళ్లుగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నప్పటికీ తమ సమస్యలను మాత్రం పరిష్కరించుకోలేక పోతుండటం శోచీనయంగా మారింది.

Also Read: కాంగ్రెస్ కు హ్యండిచ్చి.. బీజేపీలో చేరుతున్న మాజీ మంత్రి..!

కొన్నేళ్లుగా ఉద్యోగులు పీఆర్సీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. దీనికితోడు ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన ప్రమోషన్లు.. ట్రాన్స్ ఫర్లు నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతలు మొదలయ్యాయి.

ఉద్యోగులు సైతం గత ఎన్నికల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పరిశీలిస్తే తేటతెల్లమవుతోంది. దీంతో ప్రభుత్వం వారిపై గుర్రుగా ఉంటూ ఇబ్బందులకు గురిచేస్తోందని టాక్ విన్పిస్తోంది. ఈక్రమంలోనే ఉద్యోగులు పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఉద్యోగుల జేఏసీ మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ హక్కులను సాధించుకోవాలని ఉద్యోగులకు సూచిస్తోంది. దీనిపై ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు వ్యకమవుతోన్నట్లు తెలుస్తోంది. ఎన్నాళ్లు ఉద్యోగులు ఓపిక పట్టాలంటూ జేఏసీ నాయకులను నిలదీస్తున్నారు.

Also Read: కేసీఆర్ కు 24 గంటల డెడ్ లైన్ ఇచ్చిన బండి సంజయ్

ప్రభుత్వం ఆగ్రహంపై ఉద్యోగులంతా ఉద్యోగ జేఏసీకి డిసెంబర్ నాటికి డెడ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆలోగా తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించకుంటే ఉద్యమించక తప్పదని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఓ ఉద్యోగ సంఘాల రెండ్రోజుల కింద నిరసనలు చేపట్టగా.. తాజాగా తెలంగాణ ఎంప్లాయీస్​ అసోసియేషన్​ కూడా కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు నిర్ణయం తీసుకుంది. దీనిసై ఉద్యోగ జేఏసీ మాత్రం మౌనంగా ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

డిసెంబరు చివరి నాటికి పీఆర్సీ.. ప్రమోషన్లు.. ట్రాన్స్ ఫర్లు విషయంపై ఏదో ఒకటి తేల్చాలని జేఏపీపై ఉద్యోగులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఇన్నాళ్లు ప్రభుత్వం ఏది చెబితే అదే ఉద్యోగులకు చెప్పి కాలంవెళ్లదీసిన జేఏసీ నాయకులు ఇప్పుడు సర్కారుపై పోరుకు సిద్ధమవుతారా? లేదా అనేది ఆసక్తిని రేపుతోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్