https://oktelugu.com/

జేసీ రెడ్డప్పా.. ప్రధాని మోడీయే టార్గెటా అప్పా?

అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి తనలోని ఆవేశాన్ని అంతా కక్కేశాడు. ఏకంగా ప్రధాని మోడీని టార్గెట్ చేసి మరీ తనలోని అసహనాన్ని బయటపెట్టేశాడు. ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల వేళ జేసీ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. పంచాయతీ ఎన్నికల కోసం గ్రామాల్లో డబ్బే కీలక పాత్ర పోషించిందని.. ఆధిపత్యం కోసం ఓటుకు రూ.5వేలు కూడా పంచారని జేసీ దివాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో డబ్బు పంచకుండా ప్రధాన […]

Written By:
  • NARESH
  • , Updated On : February 23, 2021 / 07:38 PM IST
    Follow us on

    అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి తనలోని ఆవేశాన్ని అంతా కక్కేశాడు. ఏకంగా ప్రధాని మోడీని టార్గెట్ చేసి మరీ తనలోని అసహనాన్ని బయటపెట్టేశాడు. ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల వేళ జేసీ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

    పంచాయతీ ఎన్నికల కోసం గ్రామాల్లో డబ్బే కీలక పాత్ర పోషించిందని.. ఆధిపత్యం కోసం ఓటుకు రూ.5వేలు కూడా పంచారని జేసీ దివాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

    ఎన్నికల్లో డబ్బు పంచకుండా ప్రధాన మంత్రి గెలిస్తే తన ఆస్తి మొత్తం వదిలేస్తానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీని కూడా డబ్బులు లేకుంటే గెలవలేడు అని జేసీ కుండబద్దలు కొట్టారు. దేశంలో వ్యక్తుల కంటే డబ్బే ప్రధానమని జేసీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.

    అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జేసీ మాట్లాడారు. నామినేషన్లను ఉపసంహరించుకోవాలంటూ పోలీసులు బహిరంగంగా బెదిరించారని ఆరోపించారు.

    తాడిపత్రిలో ఏడాది క్రితం మున్సిపల్ ఎన్నికలకు ఓ నేత నామినేషన్ దాఖలు చేస్తే వైసీపీ నేతలు చించేశారని.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. అధికారులు వైసీపీ పాలనలో భయపడుతున్నారన్నారు.

    జేసీ దివాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ప్రధాని మోడీపై, వైసీపీ పాలనపై జేసీ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.