
యాంకర్ బుల్లితెరపైకి సర్రుమంటూ దూసుకొచ్చింది శ్రీముఖి. మాటల మతాబులు పేలుస్తూ.. ప్రేక్షకుల కితాబులు అందుకుంటున్న శ్రీముఖి.. అతి తక్కువ కాలంలోనే బెస్ట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఎలాంటి షో అయినా.. తనదైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన తర్వాతగానీ.. స్టేజీ దిగదు ఈ బొద్దుగుమ్మ! అయితే.. స్కిన్ షో చేయడానికి కూడా సై అనే ఈ భామ.. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఓ పిక్ లో పిచ్చెక్కిస్తోంది.
Also Read: సక్సెస్ కోసం స్టార్ డైరెక్టర్ కష్టాలు !
పటాస్ షో ద్వారా యాంకర్ గా తనదైన ముదర వేసిన శ్రీ ముఖి.. స్టేజీ షోలలో కూడా సత్తా చాటుతోంది. అయితే.. యాంకరింగ్ లో కాంపిటేషన్ పెరుగుతుండడంతో తన ప్లేస్ ను కాపాడుకునేందుకు.. అదే సమయంలో సుస్థిరం చేసుకునేందుకు తనదైన రీతిలో ప్రయత్నిస్తోంది శ్రీముఖి. ప్రస్తుతం తెలుగులో హాట్ యాంకర్స్ గా ఉన్న అనసూయ, రష్మీకి ధీటుగా నిలబడేందుకు చూస్తోంది.
అందుకే.. అప్పుడప్పుడూ ఫొటో షూట్స్ చేస్తూ.. ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తూ ఉంటుందీ బ్యూటీ. అయితే.. అదే సమయంలో గ్లామర్ డోస్ మరీ పెరగకుండా.. వల్గారిటీ గీత దాటకుండా ఉండేందుకు ట్రై చేస్తూనే ఉంటుంది. ఆ విధంగా గతంలో ఎన్నోసార్లు ఫొటో షూట్ లో కనిపించిన శ్రీముఖి.. ఇప్పుడు మాత్రం నెవర్ బిఫోర్ స్టిల్ ఇచ్చింది.
Also Read: మళ్ళీ అక్కడే షూటింగ్.. బాలయ్య సెంటిమెంట్ వల్లే !
అందానికీ.. వల్గారిటీకి మధ్య కనిపించని ఆ గీతను క్రాస్ చేసిందా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది కొందరి నుంచి! లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ పిక్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను రిలీజ్ చేసిన శ్రీముఖి.. అతి త్వరలో ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పబోతున్నానని ప్రకటించింది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక గ్రేట్ న్యూస్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించింది.
మరి, ఆ గుడ్ న్యూస్ కు ఏంటీ..? ఈ హాట్ ఫొటో షూట్ యొక్క అర్థమేంటీ? అన్నది తెలియక జుట్టుపీక్కుంటున్నారు ఫ్యాన్స్. ఏదైనా సినిమా ఆఫర్ సంబంధించిన అప్డేట్ చెబుతుందా? అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. మొత్తానికి.. ఆ న్యూస్ సంగతి ఏమోగానీ, ఈ ఫొటో మాత్రం యువత ఒంట్లోంచి సెగలు పుట్టిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్