ఏపీ రాజకీయ తెరపై ప్రతిపక్ష టీడీపీకి ప్రత్యామ్మాయం ఏదో తేలిపోయింది. పంచాయతీ ఎన్నికల సాక్షిగా ఇది బయటపడింది. ఇన్నాళ్లు ఏపీలో బీజేపీ దూకుడు చూసి అదే పార్టీ ప్రత్యామ్మాయం అనుకున్నారు. కానీ బీజేపీ పంచాయతీ ఎన్నికల్లో తేలిపోగా.. ఇప్పుడు అధికార వైసీపీకి షాకిస్తూ జనసేన చాలా సీట్లను కైవసం చేసుకుంది. ఏకంగా 27శాతం ఓట్లు సాధించి అధికార, ప్రతిపక్షాలకు ధీటుగా నిలబడింది. ఏపీలో ఇప్పుడు వైసీపీకి ధీటుగా.. టీడీపీకి ప్రత్యామ్మాయంగా జనసేన నిలబడుతోంది.
Also Read: ఏబీఎన్ డిబేట్ లో బీజేపీ నేత విష్ణుపై చెప్పుతో దాడి
జనసేనాని పవన్ కళ్యాణ్ ఆనందంగా ఉన్నారు. ఆయన అన్నయ్య మెగా బ్రదర్ నాగబాబు చాలా రోజుల తర్వాత ఈ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశాడు. జనసైనికులు గ్రామాల్లో గెలిచి పండుగ చేసుకుంటున్న వీడియోలు వైరల్ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుదారులు సాధించిన విజయాలు ఆ పార్టీలో అంతులేని జోష్ ను నింపాయి. ఇప్పటికే దీనిపై పవన్, నాగబాబు స్పందించారు. తాజాగా జనసేన మద్దతుదారులు సాధించిన విజయాలను ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.
మొత్తంగా ఏపీలో 1209 మంది సర్పంచ్ లు, 1576 మంది ఉప సర్పంచులు జనసేన గెలిచిందని అధికారికంగా ప్రకటించారు. ఇక గ్రామాల్లోని 4456 వార్డులు కూడా గెలిచామని జనసేన పార్టీ తెలిపింది.
Also Read: మోడీ సొంత రాష్ట్రంలో మున్సి‘పోల్స్’.. విజయం ఎవరిదంటే.
పంచాయతీ ఎన్నికల్లో మొత్తం ఏపీ వ్యాప్తంగా చూస్తే ఇది 27శాతం అని విజయాలను గొప్పగా జనసేన చాటి చెప్పింది.
ముఖ్యంగా జనసేన పార్టీ ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో పార్టీ మద్దతుదారులు సాధించిన విజయాలను లెక్కలతో సహా పేర్కొంది.
*జనసేన పంచాయతీ ఫలితాలు
సర్పంచులు-1209
ఉప సర్పంచ్ లు -1576
వార్డులు – 4456
మొత్తం మీద ఏపీ పంచాయతీ ఎన్నికల్లో 27శాతం విజయాలు
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్