ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ లో చర్చ పక్కదారి పట్టింది. రచ్చకు దారితీసింది. ఒకరినొకరు కొట్టుకునేలా చేసింది. ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై అమరావతి జేఏసీ నేత, దళిత నాయకుడు శ్రీనివాసరావు చెప్పుతో దాడి చేయడం కలకలం రేపింది. లైవ్ లో జరిగిన ఈ సంఘటన ప్రేక్షకులను షాక్ కు గురిచేసింది.
Also Read: మోడీ సొంత రాష్ట్రంలో మున్సి‘పోల్స్’.. విజయం ఎవరిదంటే.
అమరావతి అసంపూర్తి భవనాలను రూ.3వేల కోట్లతో నిర్మించేందుకు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపైనే ఏబీఎన్ డిబేట్ లో చర్చ జరిగింది. అమరావతి జేఏసీ నాయకుడు శ్రీనివాసరావు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి జీవిరెడ్డి, జనసేన నాయకుడు సత్యనారాయణ, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డితోపాటు మరొకరు పాల్గొన్నారు.
చర్చలో భాగంగా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డితోపాటు అమరావతి నేత శ్రీనివాసరావు హెచ్చరించాడు. ఇద్దరూ వాగ్వాదానికి దిగి లైవ్ లో కొట్టుకున్నారు. పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ శ్రీనివాసరావు అనడంతో డిబేట్ సీరియస్ అయ్యింది. ఆ తర్వాత చేతిలోకి చెప్పును తీసుకున్న శ్రీనివాసరావు అనంతరం విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి చేశాడు. లైవ్ లో ఇది జరగడంతో కలకలం రేగింది.ఆ వీడియో ఫుటేజీని చానెల్ డిలీట్ చేసింది.
Also Read: జేసీ రెడ్డప్పా.. ప్రధాని మోడీయే టార్గెటా అప్పా?
BJP leader vishnu vardhan reddy hit with chappal by TDP supporter in live channel owned by TDP pic.twitter.com/KHlvqvb9uW
— Political Missile (@TeluguChegu) February 23, 2021
బీజేపీ నేత విష్ణుకు సదురు చానెల్ జర్నలిస్టు క్షమాపణలు చెప్పారు. శ్రీనివాస్ ను బయటకు పంపించారు. ఇక నుంచి శ్రీనివాస్ ను ఏ చానెల్ ఇంటర్వ్యూకు పిలువమని ఏబీఎన్ తీర్మానించింది. అలాగే చెప్పుతో కొట్టిన వీడియోను డిలీట్ చేస్తున్నామని..యూట్యూబ్ లోనూ ఉంచనమి ఏబీఎన్ చానెల్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ ప్రకటించారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్