గ్రేట్‌ సీఎం జగన్‌ : ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్‌

దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా విద్యా వ్యాపారం నడుస్తూనే ఉంది. కార్పొరేట్‌ విద్యాసంస్థలను పేరెంట్స్‌ను నిలువునా దోచుకుంటూనే ఉన్నాయి. పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంగా తల్లిదండ్రులు దోపిడీకి గురవుతున్నారు. ఇప్పుడున్న ట్రెండ్‌లో పిల్లలకు మంచి చదువులు, ర్యాంకులే పరమావధి. ర్యాంకుల పనిముట్టుగా తమ పిల్లల్ని తీర్చిదిద్దాలంటే కార్పొరేట్ కొలిమిలో కాల్చి కాల్చి హింసించక తప్పదు. Also Read: వదిలేసిన జగన్.. షర్మిల పని అయిపోయినట్టేనా? అలాంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఓ చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. […]

Written By: Srinivas, Updated On : February 25, 2021 12:16 pm
Follow us on


దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా విద్యా వ్యాపారం నడుస్తూనే ఉంది. కార్పొరేట్‌ విద్యాసంస్థలను పేరెంట్స్‌ను నిలువునా దోచుకుంటూనే ఉన్నాయి. పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంగా తల్లిదండ్రులు దోపిడీకి గురవుతున్నారు. ఇప్పుడున్న ట్రెండ్‌లో పిల్లలకు మంచి చదువులు, ర్యాంకులే పరమావధి. ర్యాంకుల పనిముట్టుగా తమ పిల్లల్ని తీర్చిదిద్దాలంటే కార్పొరేట్ కొలిమిలో కాల్చి కాల్చి హింసించక తప్పదు.

Also Read: వదిలేసిన జగన్.. షర్మిల పని అయిపోయినట్టేనా?

అలాంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఓ చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. ఆది నుంచి పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందా అంటే.. అది చదువే అని చెప్పుకొస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఇప్పుడు మరో చారిత్రాత్మక నిర్ణయానికి వెల్‌కం చెప్పారు. ఆ నిర్ణయంతో కార్పొరేట్‌ వ్యవస్థలకు చెక్‌ పెట్టారు. కామన్‌గా కార్పొరేట్‌ విద్యాసంస్థల ప్రచారం అంతా కూడా.. అత్యాధునికమైన క్యాంపస్, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్.. అంటూ సాగుతుంటుంది. ఇప్పుడు అవన్నీ కూడా ప్రభుత్వ స్కూళ్ల వశమయ్యాయి. కేవలం ఇంగ్లిష్ మీడియం కోసమే పేదపిల్లలు కూడా కాన్వెంట్ చదువులకు వెళ్తున్నారనేది అందరికీ తెలిసిన సత్యం. అదే సమయంలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం పెడితే మాత్రం కుదరదంటారు. ఇన్నాళ్లూ ఏ ముఖ్యమంత్రీ చేయలేని సాహసం జగన్ చేశారు. ఇంగ్లిష్ మీడియం కోసం కోర్టులతో పోరాడుతున్నారు.

Also Read: బ్రేకింగ్: నేను పార్టీ పెట్టడం అన్నయ్య జగన్ కు ఇష్టం లేదు: షర్మిల సంచలన వ్యాఖ్యలు

కార్పొరేట్ కాలేజీల రెండో ప్రధాన అస్త్రం సీబీఎస్ఈ సిలబస్. ఈ సిలబస్‌లో చదివితేనే విద్యార్థులకు అవగాహన సామర్థ్యం పెరుగుతుందని, అలాంటి వారికే ఐఐటీ, ఐఐఎంలలో సీట్లు వస్తాయని, నీట్‌లో ర్యాంకులు వస్తాయని ఓ ప్రచారం ఉంది. అందుకే తమ స్కూల్‌లో సీబీఎస్ఈ సిలబస్ అంటూ అదో గొప్పగా ప్రచారం చేసుకుంటాయి ప్రైవేట్ యాజమాన్యాలు. ఇప్పుడా అవకాశానికి కూడా గండి కొడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో కూడా సీబీఎస్ఈ బోధనకు వైసీపీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది 1 నుంచి 7 వరకు, వచ్చే ఏడాది మరో తరగతి, ఆ పై ఏడాది ఇంకో తరగతి.. అలా పెంచుకుంటూ మరో మూడేళ్లకు ప్రభుత్వ స్కూళ్లు అన్నిట్లో సీబీఎస్ఈ బోధన అమలు చేయబోతున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ప్రభుత్వ స్కూళ్లలో పూర్తిస్థాయిలో ఈ విధానం అమలులోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా ఏపీ చరిత్రలో నిలిచిపోవడం ఒక ఎత్తయితే.. సీబీఎస్ఈ సిలబస్‌లోకి మారడంతో ఇంగ్లిష్ మీడియానికి ఎవరూ వంక పెట్టకుండా చేయడం మరో ఎత్తు. సీబీఎస్ఈ సిలబస్ మార్చారంటే, కచ్చితంగా ఇంగ్లిష్ మీడియంకు ఓకే చెప్పినట్టే లెక్క. అంటే ఇకపై ఇంగ్లిష్ మీడియంపై కూడా న్యాయవివాదాలు ఉండే అవకాశమే లేదు. ఇక ప్రైవేట్ స్కూల్స్‌కి ఏపీలో చిరునామా ఉంటుందని ఎవరూ ఊహించడం లేదు. జగన్ దెబ్బకి ఇప్పుడు కాకపోయినా, మరో రెండేళ్లకైనా ఏపీలో ప్రైవేట్ స్కూల్స్ పూర్తిగా కనుమరుగైపోవడం ఖాయం. అలా ఫీజుల పేరుతో జరిగే కార్పొరేట్ విద్యా దోపిడీకి ప్రభుత్వ స్కూళ్లలో ప్రమాణాలు పెంచి పరోక్షంగా చెక్ పెట్టేశారు జగన్.