పెద్దలు జానారెడ్డి గారు.. మళ్లీ ఏసారు..

‘ఆఫ్టర్రాల్ ఎమ్మెల్యే పదవి. అది నాకు చాలా చిన్నది.. అయినా నాగార్జున సాగర్ లో పోటీచేస్తా’ అంటూ పెద్దలు జానారెడ్డి గారు సెలవిచ్చారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం అవుతున్న వేళ ఈ 40 ఇయర్స్ కాంగ్రెస్ వృద్ధ నేత తనకు ఎమ్మెల్యే పదవి చిన్నదంటూ వ్యాఖ్యానించడం విశేషం. నిజానికి జానారెడ్డికి సుధీర్ఘ రాజకీయ అనుబంధం ఉంది. ఆయన నాగార్జున సాగర్ నుంచి వరుసగా గెలుస్తూ పోయిన 2019లోనే టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య […]

Written By: NARESH, Updated On : February 12, 2021 8:41 pm
Follow us on

‘ఆఫ్టర్రాల్ ఎమ్మెల్యే పదవి. అది నాకు చాలా చిన్నది.. అయినా నాగార్జున సాగర్ లో పోటీచేస్తా’ అంటూ పెద్దలు జానారెడ్డి గారు సెలవిచ్చారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం అవుతున్న వేళ ఈ 40 ఇయర్స్ కాంగ్రెస్ వృద్ధ నేత తనకు ఎమ్మెల్యే పదవి చిన్నదంటూ వ్యాఖ్యానించడం విశేషం.

నిజానికి జానారెడ్డికి సుధీర్ఘ రాజకీయ అనుబంధం ఉంది. ఆయన నాగార్జున సాగర్ నుంచి వరుసగా గెలుస్తూ పోయిన 2019లోనే టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో ఓడిపోయారు. అయితే ఆయన అకాల మరణంతో మళ్లీ ఉప ఎన్నికలు వచ్చాయి. దీంతో జానారెడ్డి తొడగొట్టారు.

ఎమ్మెల్యే పదవిని తీసిపారేసినట్టు జానారెడ్డి మాట్లాడేశారు. తనకు ఎమ్మెల్యే పదవి అనేది చాలా చిన్నదని, అయినా పోటీకి దిగుతానని జానారెడ్డి పేర్కొనడం విశేషం.. తెలంగాణలో ఎక్కువసార్లు గెలిచింది తానేనని జానారెడ్డి తెలిపారు.సాగర్ ఉప ఎన్నికల్లో తాను పోటీచేస్తానని జానారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం ఇదే ఆదేశించిందని జానారెడ్డి తెలిపారు.

తనకు పదవులపై ఆశలేదని, అధిష్టానం ఆదేశాల మేరకు పోటీకి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. అంతే తప్ప తనకు ఇష్టంతో కాదని జానారెడ్డి పేర్కొన్నారు. దీన్ని బట్టి గెలిచినా జానారెడ్డికి ఇంట్రస్ట్ లేదని.. ఆయన పనిచేయడని.. ఈ పదవి ఆయనకు వద్దని ప్రజలు ఓటు వేయకపోతే ఏంటి పరిస్థితి అని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.