అరకులో ఘోర రోడ్డుప్రమాదం.. హైదరాబాద్ లో విషాదం

అరకు అందాలను చూసి తన్మయత్వం చెందిన హైదరాబాదీలు అంతలోనే తీరని విషాదాన్ని మూటగట్టుకున్నారు. వీరి విహార యాత్ర విషాదంగా ముగిసింది. విశాఖ జిల్లా అరకులో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంతో హైదరాబాద్ లో శోకసంద్రంగా మారింది. అరకు పర్యటన ముగించుకొని వస్తున్న హైదరాబాద్ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు విశాఖ జిల్లా అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తూ లోయలోకి బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 23మంది పర్యాటకులు ఉన్నట్టు సమాచారం. అందులో నలుగురు స్పాట్ […]

Written By: NARESH, Updated On : February 12, 2021 10:22 pm
Follow us on

అరకు అందాలను చూసి తన్మయత్వం చెందిన హైదరాబాదీలు అంతలోనే తీరని విషాదాన్ని మూటగట్టుకున్నారు. వీరి విహార యాత్ర విషాదంగా ముగిసింది. విశాఖ జిల్లా అరకులో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంతో హైదరాబాద్ లో శోకసంద్రంగా మారింది.

అరకు పర్యటన ముగించుకొని వస్తున్న హైదరాబాద్ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు విశాఖ జిల్లా అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తూ లోయలోకి బస్సు బోల్తా పడింది.

ప్రమాద సమయంలో బస్సులో 23మంది పర్యాటకులు ఉన్నట్టు సమాచారం. అందులో నలుగురు స్పాట్ లోనే మృతి చెందారు. 19మందికి గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు, 108 సిబ్బంది అక్కడికి చేరుకొని గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదానికి గురైన బస్సును హైదరాబాద్ షేక్ పేటకు చెందిన దినేష్ ట్రావెల్స్ గా పోలీసులు గుర్తించారు. మృతులంతా హైదరాబాద్ కు చెందిన వారు. పూర్తిగా చీకటి పడడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

హైదరాబాద్ నుంచి అరకువచ్చిన బస్సు.. అందాలు చూసి తిరిగి వెళ్తుండగా లోయలోకి బస్సు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది.

కాగా ప్రమాద వివరాల కోసం అధికారులు కంట్రోల్ రూంని ఏర్పాటు చేశారు. వివరాలకు 08912590102, 08912590100 నంబర్లలో సంప్రదించాలని కోరారు