
కొద్దిరోజులుగా దేశంలో జమిలి ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ తరుచూ జమిలి ఎన్నికలపై ప్రస్తావిస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలు అలర్ట్ అవుతున్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం సైతం దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సై అనడంతో అందరిచూపు జమిలి ఎన్నికలపై పడింది. విశ్వసనీయ సమాచారం మేరకు 2022లో ద్వితీయార్థంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
Also Read: పాదయాత్రలకు ధీటుగా ‘బండి’ యాత్ర..!
ఈక్రమంలోనే టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.. మంత్రి కేటీఆర్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఇటీల మాట్లాడుతూ జమిలి ఎన్నికలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. త్వరలోనే జమిలి ఎన్నికల రాబోతున్నాయని పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
దీంతో టీఆర్ఎస్ అధిష్టానం పార్టీపరంగా.. పాలన పరంగా భారీ మార్పులు చేసేందుకు సన్నహాలు చేస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుండటంతో మంత్రుల మార్పు.. పాలనలోనూ మార్పు చేయనున్నట్లు కొద్దిరోజులుగా లీకులు చేస్తోంది.
Also Read: నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ కు పరీక్షగా మారనుందా?
టీఆర్ఎస్ వ్యతిరేక వర్గాలను వీలైనంత వరకు తగ్గించుకునేలా పాలనలో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు సంక్షేమ పథకాలతో మరింత చేరువయ్యేలా నిర్ణయాలు తీసుకునేందుకు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక.. వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. వరుస విజయాలతో ప్రజల్లో మరింత ఆదరణ పొందాలని స్కెచ్ టీఆర్ఎస్ స్కెచ్ వేస్తోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్