
ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబును అడ్డంగా బుక్ చేశారు సీఎం జగన్. ఎప్పుడూ లక్ష కోట్ల అవినీతి అంటూ జగన్ ను టీడీపీ, ఆయన మీడియా టార్గెట్ చేయడమే కానీ.. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఎదురుదాడికి దిగారు జగన్. చంద్రబాబు ప్రధాన వ్యాపారమైన హెరిటేజ్ సంస్థల గుట్టును విప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎలా హెరిటేజ్ తో దోపిడీ చేశారో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
Also Read: అసెంబ్లీ సాక్షిగా ‘ఈనాడు’ను ఎండగట్టిన సీఎం జగన్..!
‘1999లో రూ.2గా ఉన్న హెరిటేజ్ షేర్ విలువ చంద్రబాబు అధికారంలోకి ఉన్నప్పుడు పెరుగుతూ.. ఓడిపోగానే పడిపోతూ వస్తుందని లెక్కలతో సహా జగన్ అసెంబ్లీలో నిరూపించాడు. 2017 డిసెంబర్ లో ఏకంగా రూ.827కి చేరిందని వివరించారు. మళ్లీ ఓడిపోగానే 2020 మార్చి నాటికి రూ.205కి పడిపోయిందని జగన్ వివరించారు. ఇలా అధికారంలో ఉన్నప్పుడు ఆ అండతో చంద్రబాబు గోల్ మాల్ చేశఆడని జగన్ ఆరోపించారు.
హెరిటేజ్ షేర్లు చూస్తే షేర్ రిగ్గింగ్ చేస్తారేమోనని అనుమానం కలుగుతోందని సీఎం జగన్ అన్నారు. హెరిటేజ్ షేర్ విలువ హెచ్చుతగ్గులపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు.
హెరిటేజ్ సంస్థ అంత పెద్దగా ఎలా ఎదిగిందనే దానిపై సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చి మరీ ఎండగట్టారు. చంద్రబాబు దగ్గరుండి ప్రభుత్వం ఆధ్వర్యంలోని డెయిరీలను ఖూనీ చేశాడని జగన్ ఆరోపించారు. తన హెరిటేజ్ కోసం వాటిని బలిపశువు చేసి పాడి రైతుల నోట్లో మట్టి కొట్టారని జగన్ ఆరోపించారు. అది ఏ స్థాయిలో ఆ పని చేశారంటే.. చిత్తూరు డెయిరీ అయితే ఒకప్పుడు హెరిటేజ్ డెయిరీకి పోటీ పడ్డాయి. దాంతో దాన్ని ఖూనీ చేయడం కోసం, ఈ పెద్దమనిషి సీఎంగా ఉన్నప్పుడు, 2003లో చిత్తూరు డెయిరీని మూసేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల క్లిప్ ప్రదర్శించి చదివి వినిపించారు. ఇక చంద్రబాబుకు కావాల్సిన మనిషి దొరబాబు. ఆయనను బీఎస్ రాజా నర్సింహులు అని కూడా అంటారు. ఆయన చిత్తూరు డెయిరీకి ఛైర్మన్‌గా పని చేశారు. ఆయనను ఛైర్మన్‌ను చేసి చంద్రబాబు చక్రం తిప్పారు. తర్వాత విజయవంతంగా చిత్తూరు డెయిరీని ఆయన మూసివేయించాడు. దొరబాబు ఆ పని చేశాడు కాబట్టి, ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చాడు. ఏ రకంగా సహకార రంగాన్ని మూసివేయించారనడానికి ఇది ఒక ఉదాహరణ’ అని సీఎం జగన్ పేర్కొన్నారు..
Also Read: రజినీకాంత్ ఎన్టీఆర్ రికార్డ్ ను బద్దలుకొట్టగలడా..?
చంద్రబాబు ఆయువు పట్టు ఆయన వ్యాపారాలే అంటారు. రాజకీయంగా ఎన్నో సంవత్సరాలు సీఎంగా ఉన్నా ఆయన చేసినవి కొన్ని వ్యాపారాలు మాత్రమే.. అందులో ముఖ్యమైనది ‘హరిటేజ్’ పాలు కూరగాయల వ్యాపారమే. అయితే చంద్రబాబు సీఎం అయ్యాక అదో పెద్ద సూపర్ మార్కెట్ సిస్టంగా మారింది. ఎలా అయ్యిందనే దానిపై అంతులేని రహస్యాలు ఉన్నాయని జగన్ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబులోని అవినీతి కోణాన్ని ఆవిష్కరించారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్