
ఏపీలో ప్రత్యర్థుల లూప్ హోల్స్ తెలియాలన్నా.. వారి అనుపాయాలు పసిగట్టాలన్న ‘ఇంటెలిజెన్స్’ అత్యంత కీలకమైనది.. సీఎం కేసీఆర్ ఈ ఇంటెలిజెన్స్ ద్వారానే నాటి ఏపీ సీఎం చంద్రబాబును ‘ఓటుకు నోటు’ కేసులో ఇరికించేశారని అప్పట్లో పెద్ద టాక్ నడించింది. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా కీలక ఐపీఎస్ ల బదిలీలు చేసి మరో సంచలనం సృష్టించారు. తాజాగా ఐపీఎస్ కీలక అధికారులకు స్థాన చలనం చేసి అధికార వర్గాలను షేక్ చేశారు.
Also Read: రైతుల మెడకు మీటర్లు.. జగన్ కు లాభమా? నష్టమా?
ఏపీ సీఎం జగన్ ప్రక్షాళన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేయించారు. ఈ మేరకు ఏపీప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ డీఐజీ విజయ్ కుమార్ ను బదిలీ చేసి హోంశాఖలో ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ఇక కొంతకాలంగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి త్రివిక్రమ్ వర్మను గుంటూరు రేంజ్ డీఐజీగా నియమించారు.
గ్రేహౌండ్స్, అక్టోపస్ ఆపరేషన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ గా ఆర్.కే. మీనాను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 1995 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన మీనా.. కొంతకాలంగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇక అవినీతి లేకుండా చేస్తానని.. పారదర్శక పాలన చేస్తానన్న జగన్ ఈ మేరకు ఏసీబీ డైరెక్టర్ శంఖ బ్రతబాగ్చి బదిలీ అయ్యారు. ఆయనను ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీగా నియమించారు. బాగ్చి 1996 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. 2010 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సుధీర్ కుమార్ రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీగా నియమించారు.
Also Read: రైతు కన్నెర్ర చేస్తే.. ప్రభుత్వాలకు ఏ గతిపడుతుంది?
మొత్తంగా ప్రస్తుతం బదిలీలు చూస్తే పెరుగుతున్న నక్సలైట్ల తీవ్రతను అరికట్టడానికి కీలక అధికారులను గ్రేహౌండ్స్, అక్టోపస్ ఆపరేషన్స్ కు మార్చారు. దాంతోపాటు కీలకమైన ఇంటెలిజెన్స్, ఏసీబీ అధికారులను బదిలీలు చేశారు. అత్యంత కీలకమైన భద్రతా చర్యల్లో భాగంగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.