పూజా హెగ్డే’కి మరో బర్త్ డే ట్రీట్ !

హీరో కాకముందే విపరీతమైన హైప్ ను సంపాధించిన అక్కినేని అఖిల్.. హీరో అయ్యాక స్టార్ డమ్ ను సాధించడానికే కిందామీదా పడుతున్నాడు. ప్రస్తుతం అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ సరసన బుట్ట బొమ్మ ‘పూజా హెగ్డే’ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ రోజు ‘పూజా’ పుట్టినరోజు. ఆమె నటిస్తోన్న సినిమాల నుండి వరుసగా పోస్టర్స్ వస్తోన్న క్రమంలో.. మొత్తానికి ‘బ్యాచ్‌ల‌ర్’ నుండి కూడా పూజా అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ […]

Written By: admin, Updated On : October 13, 2020 2:44 pm
Follow us on


హీరో కాకముందే విపరీతమైన హైప్ ను సంపాధించిన అక్కినేని అఖిల్.. హీరో అయ్యాక స్టార్ డమ్ ను సాధించడానికే కిందామీదా పడుతున్నాడు. ప్రస్తుతం అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ సరసన బుట్ట బొమ్మ ‘పూజా హెగ్డే’ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ రోజు ‘పూజా’ పుట్టినరోజు. ఆమె నటిస్తోన్న సినిమాల నుండి వరుసగా పోస్టర్స్ వస్తోన్న క్రమంలో.. మొత్తానికి ‘బ్యాచ్‌ల‌ర్’ నుండి కూడా పూజా అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో.. ఓ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఎప్పటిలాగే పోస్టర్ లో ‘పూజా హెగ్డే’ గ్లామర్ లుక్ లో క్యూట్ గా నవ్వుతూ కనిపిచింది. ఈ స్టిల్ యూత్ కి అండ్ పూజా అభిమానులను బాగానే ఆకట్టుకుంటుంది.

Also Read: పూజాకి ‘రాధే శ్యామ్’ స్వీట్ సర్‌ ప్రైజ్ !

ఇక ‘ బ్యాచ్‌ల‌ర్’ నుండి ఆ మధ్య వచ్చిన ‘పూజా – అఖిల్’ కపుల్ పోస్టర్ కూడా బాగా ఆకట్టుకుంది. ఆ పోస్టర్ లో పూజా హెగ్డే తన కాలితో అఖిల్ చెవ్వును తాకుతూనే.. అఖిల్ చూపులను టీజ్ చేస్తూ కనిపించింది పూజా. రొమాంటిక్ ఫీల్ తో వచ్చిన ఆ పోస్టర్ రేంజ్ లో, ఇప్పుడు వదిలిన పోస్టర్ లేదు గానీ, పూజా ఫ్యాన్స్ కు మాత్రం ఈ పోస్టర్ నచ్చుతుంది. ఇక ఈ సినిమాలో అఖిల్ – పూజా హెగ్డేల మధ్య కొన్ని లవ్ సీన్స్ చాల బాగా వచ్చాయట. ఆ సీన్స్ లో అఖిల్ కంటే పూజానే ఎక్కువ హైలైట్ అవుతుందని.. దానికి తోడు అఖిల్ క్యారెక్టర్ కూడా పూజా క్యారెక్టర్ కంటే తక్కువ ప్రాధాన్యత ఉంటుందని, ఆ రకంగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా కూడా పూజా కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని తెలుస్తోంది.

Also Read: ఓటీటీల కొత్త రూల్స్.. బెనిఫిట్ ఎవరికీ?

కాగా ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే దాదాపు కంప్లీటయిందని సమాచారం. సంక్రాంతి బరిలో ఈ సినిమాని దింపాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సినిమాలో అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందట. ముఖ్యంగా అఖిల్ – పూజాకి మధ్య లిప్ టు లిప్ కిస్ ఉంటుందని.. ఆ కిస్ సీన్ లో మొత్తానికి పూజా హెగ్డే తన అందాలను ఆరబోయటంలో ఎలాంటి హద్దు అదుపు లేకుండా రెచ్చిపోయిందని.. అలాగే వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.