e-KYC For Ration Cards in AP: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతోంది. సంక్షేమ పథకాల అమలుతో ఖజానా ఖాళీ అవుతోంది. ఫలితంగా ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం పడుతోంది. నెలనెలా ప్రజలకు నేరుగా చెల్లించే చెల్లింపులకే ఎక్కువ భాగం నిధులు ఖర్చు కావడంతో ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ పథకాల్లో బోగస్ లను ఏరివేసే కార్యక్రమంపై పట్టు సాధిస్తోంది. రేషన్ కార్డుల(Ration Cards) వారీగా బోగస్ లను ఏరివేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక రేషన్ కార్డుపై ఒకే పింఛన్ ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం సర్కారు రేషన్ కార్డులను కేవైసీ చేయించుకోవాలని సూచిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రాష్ర్ట ప్రభుత్వం లబ్ధిదారుల్ని పరుగులు తీయిస్తోంది. సరుకులు కావాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని దీనిపై ఎలాంటి గడువు పెట్టలేదని తెలుస్తోంది. ఆధార్ కేంద్రాలకు కేంద్రం ఇంకా అనుమతి ఇవ్వకపోవడంతో రేషన్ కార్డు దారులు పిల్లలతో కలిసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ కార్డు కావాలంటే ఈ కేవైసీ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జగన్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. రేషన్ కార్డులు అడ్డుపెట్టుకుని అక్రమంగా పింఛన్లు పొందుతున్న వారిని ఏరిపారేసేందుకు నిర్ణయించుకుంది.
ప్రస్తుతం రేషన్ కార్డుల్లో కుటుంబంలో అందరు సభ్యుల పేర్లు ఉండడంతో ఒకటి కంటే ఎక్కువ మంది సామాజి పింఛన్లు పొందుతున్నారు. దీంతో కార్డుల్లో ఉన్న వారిలో మూడు నాలుగు పింఛన్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబంలో రెండు మూడు పింఛన్లు ఇవ్వాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగిపోతోంది. పింఛన్లు పక్కదారి పడుతున్నాయి. దీంతో రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ ఇచ్చేలా నిబంధనలు తెచ్చారు.
రేషన్ కార్డుకు ఒకటి కంటే మించి పింఛన్లు ఇవ్వకుండా నిబంధనలు మారుస్తున్నారు. దీంతో రేషన్ కార్డుల్లో ఉన్న ఇతర సభ్యుల పేర్లు మరో కార్డులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. రేషన్, పింఛన్ కుటుంబంలో ఒకరికి మాత్రమే అందుతుంది. ఈ విధానంతో భారీ ఎత్తున పింఛన్ల తొలగింపుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలు ఈకేవైసీ చేయించుకునేందుకు పరుగులు పెడుతున్నారు.
అయితే ఇందులో కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఇందులో దివ్యాంగులు, అభయహస్తం లబ్ధిదారులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, డీఎంహెచ్ వో పింఛన్లు ఉంటే మాత్రం వారికి మినహాయింపు ఇస్తున్నారు. దీంతో రేషన్ కార్డులో పింఛన్లు ఉంటే మాత్రం కచ్చితంగా తొలగించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే నెల్లూరు, కడప, విజయనగరంతోపాటు పలు జిల్లాల్లో ఈమేరకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. రేషన్ కార్డుల ద్వారా పింఛన్ల లో అక్రమాలు తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Jagan sarkar is another shock to ap people
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com