
ఒక మొక్కకు అంటుగట్టినట్టు.. ఓ గోడకట్టినట్టు.. చంద్రబాబును ఎక్కడ కొట్టాలో అక్కడే కొడుతూ ఆయనకు మనశ్శాంతి లేకుండా చేసేస్తున్నారు సీఎం జగన్. ఏపీ అసెంబ్లీ సాక్షిగా మునుపెన్నడూ లేనంతా ఆగ్రహంగా చంద్రబాబు రగిలిపోతున్నాడంటే జగన్ అండ్ బ్యాచ్ ఆయన్ను ఎంత ఫస్ట్రేషన్ కు గురిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
Also Read: ఏపీ పోలీస్ వర్సెస్ నారా లోకేష్.. ఎంతకు తగ్గట్లే?
ఏపీ అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు రణరంగమే సాగుతోంది. సీఎం జగన్, ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబులు కొదమ సింహాల్లా కొట్లాడుకుంటున్నారు. అయితే 40 ఇయర్స్ చంద్రబాబుకు మైక్ ఇవ్వకపోవడంతో ఆయన ఫస్ట్రేషన్ లో ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇప్పటికే ఓసారి స్పీకర్ పొడియంపై బైటాయించిన చంద్రబాబు తాజాగా జగన్ ను పట్టుకొని తిట్లదండకం మొదలుపెట్టాడు. అంతలా చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు జగన్
తాజాగా సీఎం జగన్ ఏపీ అసెంబ్లీలో తనకు, చంద్రబాబుకు మధ్యనున్న తేడాను వివరించారు. ప్రజల్లో క్రెడిబులిటీ ఉన్న నేతగా తనకు పేరుందని.. అసలు క్రెడిబులిటీ లేని నేతగా చంద్రబాబు పేరుందని జగన్ దుయ్యబట్టారు. ‘వైసీపీ ప్రభుత్వం విశ్వసనీయతతో నడుస్తోందని.. జగన్ అనే వ్యక్తికి విశ్వసనీయత ఉందని.. ఒక మాట చెబితే జనం నమ్ముతున్నారని.. దటీజ్ జగన్ ’ అని అన్నారు. అదే చంద్రబాబు విశ్వసనీయత చూస్తే బాబు ఓ మాట చెబితే.. ఆ మాట ఖచ్చితంగా చేయడనేది చంద్రబాబు క్రెడిబిలిటీ’ అని జగన్ విమర్శలు గుప్పించారు.
Also Read: సీఎంగా జగన్ అనర్హుడు పిటీషన్ పై సుప్రీం సంచలన నిర్ణయం
ఏపీ అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్.. చంద్రబాబుకు, తనకు ఉన్న తేడాను చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాల్లో తానుచెప్పిన తేదికి డబ్బులు అందని పరిస్థితి ఉందా అని సవాల్ చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం తమ నైజం అని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో తాను 90శాతం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేశామని.. అదే తన విశ్వసనీయతకు నిదర్శనం అని అన్నారు.
పేదలకు పక్కా ఇళ్లపై సభలో చర్చ సందర్భంగా చంద్రబాబు ఆరోపణలపై సీఎం జగన్ మండిపడ్డారు. ‘ఒక మనిషి వయసు పెరిగినా, స్పష్టంగా మేనిఫెస్టో అన్నది కళ్ల ముందు కనిపిస్తున్నా కూడా ఏ మాత్రం కళ్లార్పకుండా అబద్ధాలు ఆడుతున్న చంద్రబాబు నాయుడుకి నరకంలో కూడా చోటు దొరకదని’ సీఎం జగన్ కడిగిపారేశారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్