Jagan and Sharmila: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy), సోదరి షర్మిల(Sharmila) మధ్య విభేదాలు ఉన్నాయా? అంటే నిజమేననే సమాధానాలు వస్తున్నాయి. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం అన్నకు ఇష్టం లేకపోయినా కూడా ఆమె తన మాట వినకుండా చేసిందని ఆగ్రహం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే వారు ఎదురు పడడం లేదు. సెప్టెంబర్ 2 వైఎష్ వర్ధంతి సందర్భంగా వైఎస్ ఘాటు వద్ద నివాళులర్పించేందుకు జగన్, షర్మిల వస్తున్నా ఇద్దరు ఎదురుపడడం లేదనే విషయం తెలిసిందే.
వైఎస్ జయంతి రోజు ఇద్దరు వేర్వేరుగా ఎవరికి వారే అన్నట్లుగా నివాళులు అర్పించి కలుసుకోలేదు. దీంతో ఈసారి కూడా ఆ అవకాశం లేదని సమాచారం. రాఖీ పండుగ రోజు కూడా ఇద్దరు కలుసుకుని రాఖీ కట్టించుకోలేదు. దీంతో ఇద్దరిలో విభేదాలు పొడచూపినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ పెట్టిన తరువాత జగన్ కు చెల్లెలిపై మమకారం లేకుండా పోయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. షర్మిల పార్టీతో రెండు ప్రాంతాల మధ్య విభేదాలు పొడచూపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరో వైపు వైఎస్ వర్ధంతి రోజున అప్పటి మంత్రివర్గ సభ్యులతో ఓ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసిందే. ఇప్పటికే అందరికి ఆహ్వానాలు వెళ్లాయి. కానీ ఎంత మంది వస్తారో అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మీటింగ్ కు విజయమ్మ కూడా పాల్గొంటారని సమాచారం. దీంతో షర్మిల పార్టీని తెలంగాణలో మరింత దూకుడుగా నడిపించాలనే భావిస్తున్నట్లు సమాచారం.
వైఎస్ కు నివాళులర్పించేందుకు జగన్ ఉదయమే ఇడుపులపాయ చేరుకుంటారని తెలుస్తోంది. తరువాత షర్మిల, విజయమ్మ కూడా అక్కడకు చేరుకుని నివాళులర్పించి నేరుగా హైదరాబాద్ వెళతారని తెలుస్తోంది. దీంతో ఇద్దరు అన్నాచెల్లెలు ఎదురు పడే దాఖలాలు కనిపించడం లేదు. పార్టీలు వేరైనా ఒకే కుటుంబమైనా కలుసుకోకపోవడంపై పలు అనుమానాలు వస్తున్నాయి.